సాధారణంగా అమ్మాయిలు ఈ రోజుల్లో చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం కోసం ఎక్కువగా ఆరాటపడుతున్నారు. ఇక అందుకోసమే కొందరు ఇంటి చిట్కాలను పాటిస్తే, మరి కొంత మంది నిపుణుల సలహాలను పాటిస్తారు. మరి ఇంకొంతమంది అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఒక్కోసారి మంచి జరుగుతుంది. మరొకసారి ఫెయిల్ అయితే మాత్రం ఎన్నో అనర్థాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందంగా ఉండే ముఖాలు కూడా అందవిహీనంగా తయారవుతాయి.. ఫేషియల్ ట్రీట్మెంట్ ఫెయిల్ అయితే  జరిగే నష్టాలు ఏంటో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..


ఫేషియల్ ట్రీట్మెంట్ అంటే, చర్మ సంరక్షణ కోసం కొన్ని రకాల క్రీములను ,ఫేస్ ప్యాక్ లను ఉపయోగించి ,చర్మానికి కావలసిన నిగారింపును తీసుకొస్తారు.  అంతేకాకుండా టోనర్ ను  కూడా ఉపయోగిస్తారు .ఒకవేళ ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ సక్సెస్ అయింది అంటే , ముఖం ఎంతో అందంగా మారడంతో పాటు ముఖం మీద ఎలాంటి మచ్చలు, మొటిమలు కూడా ఉండవు.  ఒకవేళ ఇది విఫలం అయింది అంటే మాత్రం ,  ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఎన్నో రకాల రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఈ  ఉత్పత్తుల వల్ల ముఖ చర్మం పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  కొందరికి కెమికల్స్  ప్రభావం వల్ల దురద వచ్చే అవకాశాలు ఎక్కువ..


ఇక ఎవరైనా ఫేస్ పై తప్పుగా స్క్రబ్ చేయడం వల్ల , ముఖం మీద ఎర్రని గుర్తులు వచ్చే అవకాశం లేకపోలేదు .దీని వల్ల చర్మం యొక్క అందం కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా వికారం గా కనిపిస్తారు . చర్మవ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ. ఈ ఫేషియల్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత చర్మ రంధ్రాలు తెరచుకొని, దాని వల్ల మొటిమలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి . కాబట్టి మీ అందం మరింత చెడిపోవచ్చు.

ఫేస్ పై ఫేషియల్  ట్రీట్మెంట్ తీసుకునే సమయంలో అనేక రకాల ఉత్పత్తులను, ఉపయోగించడం వల్ల ఈ రసాయనాల కారణంగా స్కిన్ అలర్జీ వచ్చే అవకాశం ఎక్కువ . ముఖం మీద చర్మం పై సహజంగా వుండే తేమ కూడా ఆరిపోతుంది . పైగా నిగారింపు కూడా తగ్గిపోతుంది. ఒక్కసారి ముఖం మీద వాపులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.  కాబట్టి ఇలాంటి ఫేషియల్ ట్రీట్మెంట్స్ కు దూరంగా ఉంటేనే మంచిది..


మరింత సమాచారం తెలుసుకోండి: