జుట్టు సమస్యల నుండి బయటపడడానికి చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మార్కెట్ లో లభించే నూనెలను వాడడానికి బదులుగా ఇంట్లోనే నూనెను తయారీ చేసి వాడడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలంగా తయారవుతాయి.ఇంకా జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, పొడవుగా ఇంకా నల్లగా పెరుగుతుంది.మనం ఈ నూనెను తయారు చేసుకోవడం చాలా సులభం. అయితే ఎక్కువగా కేరళ వారు ఈ విధంగా నూనెను తయారీ చేసి వాడుతూ ఉంటారు. ఇలా తయారు చేసిన నూనెను వాడడం వల్ల జుట్టు పెరుగుదల చాలా చక్కగా ఉంటుందని నిపుణులు పరిశోధనల ద్వారా వెల్లడించారు. జుట్టు రాలడాన్ని తగ్గించే ఈ నూనెను ఎలా తయారు చేసుకోవాలి ఇంకా తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అలాగే ఈ నూనెను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం.


ఈ నూనెను తయారు చేసుకోవడానికి గానూ 500 ఎమ్ ఎల్ కొబ్బరి నూనెను, గుప్పెడు కరివేపాకును, 4 గంటల పాటు నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ మెంతులను, 2 టేబుల్ స్పూన్ల మందార ఆకుల పొడి, ఒక టేబుల్ స్పూన్ కలబంద గుజ్జును, 10 నుండి 15 చిన్న ఉల్లిపాయలను ఇంకా 10 నుండి 12 మిరియాలను ఉపయోగించాల్సి ఉంటుంది.ముందుగా ఒక జార్ లో కరివేపాకు ఆకులు, మెంతులు, ఉల్లిపాయలు, మందార ఆకుల పొడి ఇంకా కలబంద గుజ్జు వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి.ఆ తరువాత ఒక ఇనుప కళాయిలో ఈ పేస్ట్ ను వేసుకోవాలి. ఇందులోనే కొబ్బరి నూనెను కూడా వేసి 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తరువాత మిరియాలు వేసి మరో 2 నిమిషాల పాటు మరిగించి స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. ఇక ఈ నూనె చల్లారిన తరువాత వడకట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నూనెను జుట్టుకు పట్టించే ముందు తగినంత నూనెను తీసుకుని దాన్ని గోరు వెచ్చగా చేసుకుని జుట్టు కుదుళ్లకు బాగా పట్టించాలి. దీనిని ఒక అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుంది. జుట్టు సమస్యలన్నీ ఈజీగా తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: