అన్నం ఉడికిందో లేదో చెప్పడానికి ఒక్క మెతుకు చూస్తే చాలన్నట్లు ఓ దర్శకుడు ప్రతిభ ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక్క సినిమా కాదు, ఒక్క టీజర్ చాలు.. సందీప్ రెడ్డి వంగ నిజంగా గొప్ప దర్శకుడు అందానికి అర్జున్ రెడ్డి సినిమా చాలు..  అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో ఎలాంటి ట్రెండ్ సృష్టించిందో అందరికి తెలిసిందే..  హీరో విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన సినిమా.. ఓవర్ నైట్ లో చిన్న సినిమాలు చేసే విజయ్ ని స్టార్ హీరో చేసిన సినిమా.. అలాగే సందీప్ రెడ్డి వంగ టాప్ దర్శకుడిగా మార్చేసిన సినిమా.. ఒక దర్శకుడు తొలి సినిమా తోనే స్టార్ దర్శకుడు అయినది ఒక్క సందీప్ విషయంలోనే కావచ్చు..