ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌రుస‌గా సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌ల్లోకి దూసుకు పోతున్నారు. జ‌గ‌న్ నిర్ణ‌యాలు, సంస్క‌ర‌ణలు ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. ఈ నిర్ణ‌యాల‌తో ప్ర‌తిప‌క్షాల‌కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతోంది. ఇక తాజాగా ఏపీ చ‌రిత్ర‌లోనే మొట్ట మెద‌టి సారిగా కౌలుదారు రైతులు, గిరిజ‌న రైతుల‌తు ప్ర‌భుత్వం నుంచి ఆర్థిక సాయం పొందే విధంగా జ‌గ‌న్ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.

 

 వైఎస్సార్ రైతు భ‌రోసా ప‌థ‌కంలో భాగంగా 49.43 లక్షల మంది లబ్ధిదారుల‌కు ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది. ఇక ఈ ప‌థ‌కంలో భాగంగా ప్ర‌తి రైతుకు రు. 5500 ఇస్తారు. ఈ ఖ‌రీఫ్ సీజ‌న్ నుంచే ఇది అమ‌ల్లోకి వ‌స్తుంది. ఈ ప‌థ‌కం ప్రారంభం నేప‌థ్యంలో ఇది రైతుల‌కు ఎంతో మేలు చేకూరుస్తుందంటూ రోజా త‌న ట్విట్ట‌ర్ పోస్ట్ పెట్ట‌డంతో పాటు  చంద్ర‌బాబు రైతుల‌ను ఎలా మోసం చేశారు.. వైఎస్‌... జ‌గ‌న్ వ‌ల్ల రైతులు ఎలా ప్ర‌యోజ‌నం పొందారో ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: