
26న దేశావ్యాప్తంగా భారత బంద్ కు పిలుపునిస్తున్నామని, వైసీపీ ఎంపీలు రాజీనామా చేసి పోరాడాలి అని కోరారు. పిల్లలకు పాఠశాలలో విద్యాసంస్థలో కరోనా నిబంధనలు పాటించడం లేదు అని మండిపడ్డారు. క్లాసులు జరగడం వలన పిల్లల ప్రాణాల మీదకు వస్తుంది అన్నారు. ప్రైవేట్ పాఠశాలల్లో కరోనా నిబంధనలు లేవు అని ఆరోపించారు. విద్యార్థుల ప్రాణాలకంటే పాఠాలు ఎక్కువ కాదు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచించి ఆన్లైన్ లో క్లాసులు జరపాలని డిమాండ్ చేసారు.