టాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని ఆయ‌నే ట్విట్ట‌ర్ ద్వారా స్ప‌ష్టం చేశారు. ఎవ‌రూ కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని ప్ర‌స్తుతం తాను బాగానే ఉన్నాన‌ని తార‌క్ స్ప‌ష్టం చేశారు. త‌న‌తో పాటు కుటుంబ సభ్యులంద‌రూ హోమ్ ఐసోలేష‌న్ లో ఉన్న‌ట్లు చెప్పారు. డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూ అన్ని కోవిడ్ నియ‌మ నిబంధ‌న‌లు పాటిస్తున్న‌ట్లు చెప్పారు. గ‌త కొన్ని రోజులుగా త‌నను కాంటాక్ట్ అయిన‌వాళ్లు వెంట‌నే టెస్టులు చేయించుకోవాల‌ని ఎన్టీఆర్ సూచించారు. అయితే, ఎన్టీఆర్ కు కరోనా ఎలా సోకింది అనేది ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఎన్టీఆర్ నటిస్తున్న rrr సినిమా షూటింగ్ కూడా కరోనా నేపధ్యంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే. మరి NTRకు కరోనా ఎలా సోకింది అని అందరి నోట వినిపిస్తున్న మాట. అయితే ప్రస్తుతం తన తరువాత సినిమా కోసం కొన్ని కధలు వింటున్నారని, కొంత మంది డైరక్టర్లతో ntr కధ చర్చలో కూడా పాల్గంటున్నారని.. ఈ క్రమంలో NTRకు కరోనా సోకి ఉండచ్చు అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా.. తాజాగా NTRతన కొడుకుతో కలిసి మాస్క్ లేకుండా బయట చక్కర్లు కొట్టారు.. ఇలా కూడా NTRకు కరోనా సోకి ఉండచ్చు అని అంటున్నారు. ఏది ఏమైనా .. కారణం ఏదైనా ntr కరోనా బారిన పడ్డారు. ntr త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ప్రార్ధనలు చేస్తున్నారు.
 

మరింత సమాచారం తెలుసుకోండి: