ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాత్రి క‌ర్ఫ్యూను పొడిగించింది. ఈనెల 30వ తేదీవ‌ర‌కు రాత్రి ప‌దిగంట‌ల నుంచి ఉద‌యం ఆరుగంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ అమ‌ల్లో ఉండ‌నుంది. కొవిడ్ నిబంధ‌న‌లు, తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. కేసుల సంఖ్య త‌గ్గ‌డం, పెర‌గ‌డం కాకుండా య‌థావిధిగా కొన‌సాగుతుండ‌టంతో క‌ర్ఫ్యూను పొడిగించాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించారు. ప్ర‌జ‌లు స‌మూహాలుగా తిర‌గొద్ద‌ని, వీటిపై ఆంక్ష‌లు క‌ఠినంగా ఉంటాయ‌ని ప్ర‌భుత్వం త‌న ఉత్త‌ర్వుల్లో పేర్కొంది. ఇప్ప‌టికే మూడోద‌శ మొద‌లైంద‌ని ప‌లువురు వైద్య‌నిపుణులు పేర్కొంటుండ‌గా ఏపీలోని తూర్పుగోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో కేసులు త‌గ్గ‌డంలేద‌ని, దీనికి కార‌ణాలు అన్వేషించాల్సి ఉందంటున్నారు. జ‌న‌స‌మ్మ‌ర్ధం ఎక్కువ‌గా ఉండే ప్రాంతాల‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని, అలాగే వివాహాలు, ఇత‌ర వేడుక‌ల‌కు అనుమ‌తివ్వొద్ద‌ని నిపుణ‌లు సూచిస్తున్నారు. కేర‌ళ‌, మ‌హారాష్ట్ర లాంటిచోట్ల ఇప్ప‌టికే మూడోద‌శ ప్రారంభ‌మైంద‌ని అంచ‌నా వేస్తుండ‌గా, రానున్న రెండువారాల్లో క‌రోనా మూడోద‌శ గురించి ఒక స్ప‌ష్ట‌త వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tag