
ఎవరూ ఊహించని విధంగా అక్కినేని హీరో సుమంత్ రెండో పెళ్లి వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుమంత్ పవిత్ర అనే ఒక అమ్మాయిని పెళ్లాడబోతున్నాడని రెండు మూడు రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి తగ్గట్టు సుమంత్ వెడ్స్ పవిత్ర అని వెడ్డింగ్ కార్డులు ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ కావడంతో కొంత మంది ఇది నిజమేనని నమ్మేశారు కూడా.
అయితే ఇది నిజం కాదని ఒక సినిమా కోసం వెడ్డింగ్ కార్డ్స్ చేయించామని కానీ అవి లీక్ కావడంతో నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాం అని వార్తలు బయటకు వచ్చాయి అని నిన్న సుమంత్ క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ రిలీజ్ చేస్తామని నిన్న రాత్రి చెప్పినట్టుగా ఈరోజు ఉదయం టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టైటిల్ మళ్ళీ మొదలైంది కాగా సుమంత్ హీరోగా నటిస్తున్నారు. అలాగే నైనా గంగూలీ హీరోయిన్ గా నటిస్తున్నారు. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రాజశేఖర్ రెడ్డి అనే నిర్మాత నిర్మిస్తున్నారు. లైఫ్ ఆఫ్టర్ డివోర్స్ అంటూ ఫస్ట్ లుక్ కూడా ఆసక్తికరంగా మలిచారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.