ప్రస్తుతం ఎక్కడ చూసినా బుల్లెట్ బండి పాట మోగిపోతుంది. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు ఈ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఈ పాట మరీ ఎక్కువగా వినిపిస్తోంది. ఈ పాటను రిలీజ్ చేసిన కొద్ది రోజులకే మిలియన్స్ కొద్ది వ్యూస్ రాగా ఓ పెళ్లికూతురు ఈ పాటకు స్టెప్పులేయడం తో పాట మరింత పాపులర్ అయ్యింది. ఆ తర్వాత ఓ నర్సు ఇదే పాటకు డాన్స్ చేయడంతో పాటకు మరింత క్రేజ్ వచ్చింది.

అయితే మొదట విమర్శలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు తాజాగా ఈ పాటకు ఎంపీ మాలోత్ కవిత కూడా స్టెప్పులేసి ఆకట్టుకుంది. మహబూబాబాద్ లో ఓ పెళ్లికి హాజరైన ఎంపీ కవిత బుల్లెట్ బందెక్కి వచ్చేస్తా బా అనే పాటకు డాన్స్ చేశారు. కొత్తజంట తో కలిసి మాలోత్ కవిత డాన్స్ చేసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు సూపర్ గా డ్యాన్స్ చేశారు మేడం అంటూ కవిత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: