వైఎస్సార్‌తెలంగాణ‌పార్టీ అధ్య‌క్షురాలు ష‌ర్మిల చేవెళ్ల నుంచి బుధ‌వారం ప్ర‌జాప్ర‌స్థానం పేరుతో పాద‌యాత్రను మొద‌లు పెట్టారు. విజ‌య‌మ్మ జెండాఊపి పాద‌యాత్ర‌ను ఆరంభించారు. 4వేల కిలోమీట‌ర్ల‌ను దాదాపు 400 రోజులు చేప‌ట్ట‌నున్నారు. మ‌ర‌ల పాద‌యాత్ర‌ను చేవెళ్ల‌లో ముగించ‌నున్నారు. తొలిరోజు ష‌ర్మిల పాద‌యాత్ర ముగిసింది. చేవెళ్ల‌, కంద‌వాడ మండ‌లాల‌లో పాద‌యాత్ర కొన‌సాగింది. ఈరోజు రాత్రికి కంద‌వాడ‌లో బ‌స చేయ‌నున్నారు. రేపు ఉద‌యం 9.30 గంట‌ల‌కు మ‌ర‌ల ప్రారంభించ‌నున్నారు పాద‌యాత్ర‌ను ష‌ర్మిల‌.

వైఎస్సార్ అభిమానులు, కార్య‌క‌ర్త‌లు అంద‌రూ త‌న‌ను మ‌న‌స్పూర్తిగా  ఆశీర్వ‌దించాల‌ని ష‌ర్మిల కోరింది. వైఎస్సార్‌టీపీ  పాద‌యాత్ర గురించి ప్ర‌క‌ట‌న చేసి 100 రోజులు పూర్తి చేసున్న సంద‌ర్భంలో వైఎస్సార్‌కు నివాళుల‌ర్పించారు త‌ల్లి విజ‌య‌మ్మ‌తో క‌లిసి ఇడుపుల‌పాయ‌లో ష‌ర్మిల‌.  ఇక 2003లో దివంగ‌త ముఖ్య‌మంత్రి  వైఎస్‌రాజ‌శేఖ‌ర్‌రెడ్డి చేవెళ్ల నియోజ‌క‌వ‌ర్గం నుంచే పాద‌యాత్ర‌ను ప్రారంభించిన విష‌యం విధిత‌మే. 2012లో కూడ ష‌ర్మిల పాద‌యాత్ర చేప‌ట్టారు. తెలంగాణ‌లో ష‌ర్మిల పార్టీ స్థాపించిన త‌రువాత తొలి పాద‌యాత్ర ఇది. 4వేల కిలోమీట‌ర్లు పాద‌యాత్ర చేప‌ట్టి ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు తెలుసుకొని ఓట్లు సాధిస్తుందో లేదో కొద్దిరోజులు వేచి చూడ‌క త‌ప్ప‌దు.  


మరింత సమాచారం తెలుసుకోండి: