ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని అనంత‌పురం జిల్లా క‌ల్యాణ‌దుర్గంలో దారుణం చోటు చేసుకున్న‌ది. రెండు నెల‌ల ప‌సిపాప‌ను ఓతండ్రి చంపేశాడు. క‌ల్యాణ‌దుర్గంలో నివ‌సించే మ‌ల్లికార్జున్, చిట్టెమ్మ‌ దంప‌తుల‌కు రెండు నెల‌ల క్రితం ఓ పాప పుట్టింది. ఆ పాప పుట్టిన‌ప్ప‌టి నుంచి త‌రుచూ గొడ‌వ‌ప‌డుతుండేవాడు మ‌ల్లికార్జున్‌. ఇదే క్ర‌మంలో గురువారం భార్య‌తో గొడ‌వ ప‌డ్డాడు. నిన్న మ‌ధ్యాహ్నం పాప‌ను తీసుకొని బ‌య‌టికి వెళ్లాడు. ఎంత‌కు రాక‌పోవ‌డంతో భార్య పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది.

బిడ్డ‌ను చంపుతాడ‌నే భ‌యంతోనే భార్య పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. బిడ్డ త‌న పోలీక‌ల‌తో లేదు. త‌న‌కు పుట్ట‌లేద‌నే నెపంతో త‌రుచూ గొడ‌వ ప‌డుతుండేవాడు మ‌ల్లికార్జున్‌.  నిన్న తీసుకెళ్లిన బిడ్డ ఈరోజు మృతిచెందిన మృత‌దేహం ల‌భ్య‌మైంది. ఇవాళ ఒక  గోనెసంచిలో మూట‌క‌ట్టి ఉన్న పాప మృత‌దేహం కనిపించింది. గోనెసంచెలో బిడ్డ‌ను వేసి పాప నోటికి ప్లాస్ట‌ర్ వేశాడు. దీంతో ఊపిరి ఆడ‌క పాప ప్రాణాలు విడిచింది. నిర్జీవంగా క‌న‌ప‌డిన పాప‌ను చూసి ఆ త‌ల్లి త‌ల్ల‌డిల్లిపోయింది. పోలీసులు రాత్రి నుంచి గాలింపులు చేప‌ట్టారు. ఇవాళ ఓ గోనెసంచిలో ల‌భ్య‌మైంది. నిందితుడు మాత్రం పోలీసుల‌కు దొర‌క‌లేదు. నిందితుని కోసం గాలింపు చేప‌డుతున్నామ‌ని పోలీసులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: