రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి టీడీపీ అధికార ప్ర‌తినిధి కొమ్మారెడ్డి ప‌ట్టాభిరామ్ విడుద‌ల‌య్యారు. ఇవాళ ప‌ట్టాభికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయ‌డంతో జైలు నుంచి విడుద‌ల అయ్యారు. రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు అని ప‌ట్టాభిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన విష‌యం విధిత‌మే. బెయిల్ కోరుతూ ప‌ట్టాభి త‌రుపు న్యాయ‌వాది హైకోర్టులో పిటిష‌న్ వేశారు.  పిటిషన్ స్వీక‌రించిన హై కోర్టు కిందిస్థాయి కోర్టు సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని సూచించింది.

ప‌ట్టాభికి బెయిల్ మంజూరు చేసే స‌మ‌యంలో హైకోర్టు కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. 41 సీఆర్పీసీ స‌మాధానం రాకుండానే ఎందుకు అరెస్ట్ చేశార‌ని ఏపీ పోలీసుల‌ను హైకోర్టు ప్ర‌శ్నించింది.  41 ఏ నోటీసులు జారీ చేసే ప్ర‌క్రియ పోలీసులు అమ‌లు చేయ‌లేద‌ని వెల్ల‌డించింది. కౌంట‌ర్ దాఖ‌లు చేయాల‌ని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది హైకోర్టు.  పట్టాభిపై క్రైం నెంబ‌ర్‌.352/2021తో ఐపీసీ 153(ఎం), 505(2), 353, 504 రెడ్‌విత్‌ 120(బి) సెక్షన్ల కింద గవర్నర్‌పేట పోలీస్ స్టేష‌న్‌లో కేసు ఫైల్ చేశారు.  రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలు నుంచి విడుద‌ల కావ‌డంతో టీడీపీ నాయ‌కులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: