రాష్ట్రపతి పీఠంగా వెంకయ్య నాయుడు.. నిన్నంతా జరిగిన ప్రచారం ఇది.. నిన్న సికింద్రాబాద్‌లో యోగా ఉత్సవాల్లో పాల్గొన్న వెంకయ్యను ఉన్నట్టుండి ఢిల్లీ పిలిపించారు. ఆయన హుటాహుటిన విమానం ఎక్కి ఢిల్లీ వెళ్లిపోయారు. అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడిని ఆగమేఘాల మీద హస్తినకు రమ్మన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆయన్ను ఇంటికి వచ్చి కలిశారు.


దీంతో రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడి అభ్యర్థిత్వం ఖరారు చేస్తున్నారన్న ప్రచారం జరిగింది. ఒక దేశలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వంటి వారు తొందరపడి ముందే .. వెంకయ్యకు అంతా మద్దతు ఇవ్వాలని కూడా ప్రకటనలు చేశారు. సాధారణంగా అధికార కూటమికి చెందిన ఉపరాష్ట్రపతి ఉంటే తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లో వారికే పదోన్నతి కల్పించడం గతంలో చాలాసార్లు జరిగింది. ఇప్పుడు కూడా అలాగే జరగొచ్చు అనుకున్నారు. కానీ మోడీ అనూహ్యంగా ఎస్టీలకు అవకాశం కల్పించాలని నిర్ణయించి ద్రౌపది ముర్ముకు ఛాన్స్ ఇచ్చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: