ఏపీలో ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో ఆలస్యం జరుగుతుందని చాలా రోజుల నుంచి వివాదం ఉంది. ఇప్పుడు వారిలో కొందరికి ఉపశమనం లభించింది. ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో నాలుగోవిడతగా ఏపీకి కేంద్రం 1769 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటి వరకూ కేంద్రం మొదటి విడతగా 929 కోట్లు, రెండో విడతగా 228 కోట్లు, మూడో విడతగా 670 కోట్లు, నాలుగో విడతగా 1769 కోట్లు మంజూరు చేసింది.

2022-23 ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకూ 3597 కోట్ల రూపాయల్ని మంజూరు చేసినట్టు కేంద్రం తెలిపింది. ఇప్పటి వరకూ 1352 కోట్ల రూపాయల రోజువారీ వేతనాలను లబ్దిదారుల ఖాతాలకు జమ చేశామని ఏపీ ప్రభుత్వం కూడా వివరణ ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని త్వరలోనే జమ చేస్తామని తెలిపిన పంచాయితీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ ఓ ప్రకటనలో తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap