తెలంగాణ రాష్ట్రంలో హాత్‌ సే హాత్‌ జోడో అభియాన్‌ కార్యక్రమాన్నివిజయవంతం చేసేందుకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తునత్నారు. ప్రత్యేకంగా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్‌ మహేశ్వర్‌ రెడ్డిలు ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశం గురించి చర్చించారు. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 6వ తేదీ నుంచి రెండు నెలలపాటు జరగాల్సిన ఈ కార్యక్రమం విజయవంతంగా కొనసాగేందుకు వ్యూహం రెడీ చేశారు.

ఇందుకు వీలుగా  12 మంది సభ్యులతో ఓ కమిటీ వేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఉమ్మడి జిల్లాలను ప్రామాణికంగా తీసుకుని జిల్లాకు ఒకరు లెక్కన పది మంది చైర్మన్‌, కన్వీనర్లు ఉంటారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. దీనికి ఛైర్మన్‌గా మహేశ్వర్‌ రెడ్డి ఉంటారు.  కన్వీనర్‌గా మాజీ మంత్రి ఆర్‌ దామోదర్‌ రెడ్డి ఉంటారు. ఈ కమిటీ జిల్లాల వారీగా, నియోజక వర్గాల వారీగా ఇంఛార్జిలుగా నియమించిన సీనియర్‌ ఉపాధ్యక్షులను, ఉపాధ్యక్షులను, ప్రధాన కార్యదర్శులను సమన్వయం చేసుకుని కార్యక్రమాలకు ఏలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగేట్లు చూడాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: