చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్తుల లెక్కలు ఇప్పుడు దేశంలోనే చర్చనీయాంశం అవుతున్నాయి. పారిశ్రామిక వేత్త అయిన తన ఆస్తులను అఫిడవిట్‌లో చూపించారు.  విశ్వేశ్వర్‌‌రెడ్డి, ఆయన భార్య, కొడుకుకు కలిపి మొత్తం రూ.4,488 కోట్ల చరాస్తులు ఉన్నాయట. ఇఖ స్థిరాస్తులు కలిపితే మొత్తం ఆస్తుల విలువ రూ. 4,568.21 కోట్లు వరకూ ఉంటుందట. ఈ ఆస్తుల లెక్కలు చూస్తే.. విశ్వేశ్వర్‌రెడ్డి దేశంలోనే అత్యంత సంపన్న రాజకీయ నాయకుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. విశ్వేశ్వర్‌రెడ్డి టాప్ 5లో  నిలిచే అవకాశం ఉంది.


విశ్వేశ్వర్‌‌రెడ్డికి రూ.1,178.72 కోట్ల చరాస్తులు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి భార్య సంగీతారెడ్డికి  రూ.3,203 కోట్లు ఉన్నాయి. విశ్వేశ్వర్‌రెడ్డి కొడుకు విరాజ్‌‌ మాధవ్ కు రూ.107.44 కోట్ల చరాస్తులున్నట్టు ఉన్నట్టు అఫిడవిట్ లో చూపించారు. విశ్వేశ్వర్‌‌రెడ్డి పేరు మీద స్థిరాస్తులు రూ.71.34  కోట్లు ఉన్నాయి. ఆయన భార్య సంగీతారెడ్డి పేరు మీద రూ.3.6 కోట్లు,  కొడుకు విరాజ్‌‌ మాధవ్‌‌ కు రూ.1.27 కోట్లు ఉన్నాయి. ఇన్ని ఆస్తులు ఉన్నా విశ్వేశ్వర్‌రెడ్డికి కారు మాత్రం లేదని చూపించడం కొసమెరుపు.


మరింత సమాచారం తెలుసుకోండి: