దేశ టెలికాం రంగంలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో బరిలోకి దిగిన రిలయన్స్ జియో.. ఇప్పటి వరకు ఎన్నో  బంపర్ ఆఫర్ ప్రకటించింది.  జియో సేవలు కేవలం 4జీ మొబైల్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఆ మద్య ఇప్పటి వరకు రూ.3500కు బేసిక్ 4జీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లను యూజర్లకు అందించిన జియో ఇకపై రూ.1500 కే ఆ ఫోన్‌ను అందించేందుకు ఏర్పాట్లు చేసింది.   రీసెంట్ గా రూ. 1000 నుంచి రూ 6 లక్షల కోట్లకు, 16 కోట్ల మందిని తాకిన జియో.
Image result for రిలయన్స్ జియో
పారిశ్రామిక దిగ్గజం జియో అధినేత ముఖేష్ అంబాని రిలయన్స్ గ్రూపు 40వ వార్షికోత్సవ వేడుకలను ముంబైలో అట్టహాసంగా నిర్వహించారు.  తాజాగా ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో నవంబరులో రికార్డు సృష్టించింది. ఏకంగా 21.8 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఆ నెలలో అగ్రస్థానంలో నిలిచింది. టెలికం నియంత్రణ సంస్థ నిర్వహించిన స్పీడ్ టెస్ట్‌లో జియో టాప్ ప్లేస్‌కు ఎక్కింది. ఆ తర్వాతి స్థానాల్లో ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులార్‌లు తర్వాతి  స్థానాల్లో నిలిచాయి.
Image result for రిలయన్స్ జియో
  ఆ నెలలో అప్‌లోడ్ వేగంలో జియో నాలుగో స్థానానికి పడిపోయింది. 7.1 ఎంబీపీఎస్ అప్‌లోడ్ వేగంతో ఐడియా అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్, వొడాఫోన్, జియోలు వరుసగా 3.9, 6.2, 4.9 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.టెలికం ఆపరేటర్లు ఇటీవల అప్‌లోడ్, డౌన్‌లోడ్ వేగాలను క్రమంగా పెంచుతూ పోతున్నప్పటికీ మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్‌లో  భారత్ స్థానం 109 దగ్గర ఆగిపోయింది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లో 76వ స్థానంలో ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: