ఏటీఎం వినియోదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. పలు బ్యాంకుల ద్వారా డబ్బులు ఎన్ని సార్లయినా డ్రా చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. సాధారణంగా పరిమితి కంటే ఎక్కువగా విత్ డ్రా చేస్తే సంబంధిత బ్యాంకులు ఒక సారికి 20–30 నుంచి రూపాయిల చార్జీలు విధిస్తుంది. తమ సొంత ఖాతాదారులు తమ ఏటీఎం సెంటర్లలో 5 సార్లు, ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మూడు సార్లు ఉచితంగా లావాదేవీలు జరుపుకోవడానికి అనుమతి ఇస్తుంది. అయితే ఈ నిబంధనలు గతేడాది నుంచి అమల్లోకి వచ్చాయి.

అయితే తాజా నిబంధనల ప్రకారం ఏ బ్యాంకు ఖాతాదారుడైన ఇండసిండ్ బ్యాంకు ఏటీఎం సెంటర్ నుంచి అపరిమితంగా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అలాగే ఐడీబీఐ బ్యాంకు కూడా తన సొంత ఖాతాదారులకు అపరిమితంగా ఎన్ని సార్లయినా విత్ డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కానీ ఇతర బ్యాంకుల ఏటీఎం సెంటర్ల నుంచి కేవలం ఐదు మాత్రమే లావాదేవీలు జరపడానికి అవకాశం ఇచ్చింది. అలాగే మరో బ్యాంకు సిండికేట్ బ్యాంక్ కూడా తన ఖాతాదారులకు అపరిమితంగా లావాదేవీలు జరపడానికి అవకాశం కల్పిస్తోంది.

అయితే గతంలో ఇలాంటి నిబంధనలు అమల్లో లేవు. ప్రతీ బ్యాంకు తన ఖాతాదారులకు ఏ బ్యాంకు ఏటీఎం నుంచైనా అపరిమితంగా డబ్బులు డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పించేది. కేవలం ఏటీఎం వాడినందుకు ఏడాదికి ఒక సారి చార్జీలు విధించేది. నగదు రహిత లావాదేవీలు జరపాలనే ఉద్దేశంతో ఆర్బీఐ నగదు ఉపసంహరణకు చార్జీలు విధిస్తోంది. అప్పటి నుంచి బ్యాంకులు విత్ డ్రా కోసం ఛార్జీలు విధించడం మొదలు పెట్టింది. కానీ ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా ఛార్జీలు విధిస్తున్నాయి. ఇందులో కూడా మెట్రో నగరాల్లో ఒక విధంగా, సాధారణ నగరాల్లో ఒక విధంగా చార్జీలు విదిస్తూ వస్తోంది. ఈ నిబంధనలు ఆర్బీఐ తరచూ మరస్తూ వస్తోంది. కొన్ని ఖాతాదారులకు సౌకర్యవంతంగా ఉంటుండగా.. మరి కొన్ని ఇబ్బందికర అంశాలు ఉంటుంన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

atm