గ్యాస్ సిలిండ‌ర్ వినియోగ‌దారుల‌కు, గ్యాస్ డెలివ‌రీ బాయ్స్‌కు ఒక శుభ‌వార్త అనే చెప్ప‌వ‌చ్చు. ముఖ్యంగా గ్యాస్‌ను ఒక చోట నుంచి మ‌రొక చోటుకు త‌ర‌లించాలంటే చాలా బ‌రువు ఉండ‌డం వ‌ల్ల కొంత మంది అయితే ఇద్ద‌రు ప‌ట్టుకుని తీసుకెల్తారు. ఇక నుంచి ఆ ఇబ్బంది క‌లుగ‌కుండా చేస్తున్నాయి కంపెనీలు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ కూడా కాలంతో పాటు మారుతున్నాయి. దేశీ గ్యాస్‌కంపెనీలు ఇప్పుడు గ్యాస్ సిలిండ‌ర్ల‌లో కూడా మార్పులు తీసుకొస్తున్నాయి. సాధార‌ణ సిలిండ‌ర్లు మాత్ర‌మే కాకుండా ఇప్పుడు ఇత‌ర కంపెనీలు కంపోసైజ్ గ్యాస్ సిలిండ‌ర్లు కూడా అందిస్తున్నాయి. వీటి బ‌రువు చాలా త‌క్కువ‌గా ఉంటున్న‌ది. వీటిని చాలా సుల‌భంగా తీసుకెళ్ల‌వ‌చ్చు.

కంపోసైట్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర రూ.634గా ఉంది. ప్రాంతం ప్రాతిప‌దిక‌న ధ‌ర‌లో కొంత మేర వ్య‌త్యాసం ఉండ‌వ‌చ్చు. ఈ సిలిండ‌ర్ బ‌రువు 10 కేజీలు ఉంటుంది. అంతేకాకుండా ఈ సిలిండ‌ర్ చూడ‌డానికి పార‌ద‌ర్శ‌కంగా ఉన్నాయి. అంటే మీకు సిలిండ‌ర్లలో ఎంతో గ్యాస్ ఉందో క‌నిపిస్తుంది. ఐరాన్ సిలిండ‌ర్‌తో పోలిస్తే.. కంపోసైట్ సిలిండ‌ర్ ధ‌ర 7 కేజీలు త‌క్కువ‌గా ఉంటుంది. ప్ర‌స్తుతం మ‌నం ఉప‌యోగించే గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర 17 కేజీలు ఉండ‌గా.. కొంపైసైట్ గ్యాస్‌సిలిండ‌ర్ బ‌రువు 10 కేజీలు మాత్ర‌మే ఉంటుంది. ఇందులో 10 కేజీల గ్యాస్ ఉండ‌డం విశేషం. బ‌రువు త‌క్కువ‌గా ఉన్నా కూడా ఈ సిలిండ‌ర్లు చాలా ప‌టిష్టంగా ఉంటాయ‌ట‌.

కంపోసైట్ సిలిండ‌ర్ బ‌రువు మొత్తంగా 20 కేజీలుంటాయి. అదేవిధంగా సాధారాణంగా మ‌నం వాడే సిలిండ‌ర్ బ‌రువు 30 కేజీల‌కు పైగానే ఉంటుంద‌నే విష‌యం గుర్తు పెట్టుకోవాలి. అందువ‌ల్ల కంపోసైట్ సిలిండ‌ర్‌ను ఒక చోటు నుంచి మ‌రొక చోటుకు తీసుకెళ్ల‌డం చాలా ఈజీగానే ఉంటుంది. ఇక‌పోతే ఏయే ప్రాంతాల్లో ఈ సిలిండ‌ర్ ధ‌ర ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

అయితే ఇండియ‌న్ ఆయిల్ ప్ర‌కారం.. కంపోసైట్ గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ముంబైలో రూ.634గా ఉండ‌గా.. కోల్‌క‌తాలో రూ.652 వ‌ద్ద కొన‌సాగుతున్న‌ది. ఇక చైన్నైలో రూ.645 గా ఉండ‌గా.. ల‌క్నోలో ఈ సిలిండ‌ర్ ధ‌ర రూ.660 ఉంది. అదేవిధంగా పాట్నాలో అయితే రూ.697 చెల్లించాలి. ఇక ఇండోర్‌లో ఈ సిలిండ‌ర్ ధ‌ర రూ.653 ఉండ‌గా.. హైద‌రాబాద్‌లో కూడా ఈ సిలిండ‌ర్ ధ‌ర రూ.670 వ‌ద్ద కొన‌సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: