ఇండియాలో జీఎస్టీ (గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్) ను అమల్లో కి తీసుకు వచ్చి చాలా కాలమే అవుతుంది . దీని ద్వారా పెద్ద మొత్తం లోనే మన దేశానికి పన్నుల రూపం లో డబ్బులు వస్తున్నాయి . ఇకపోతే తాజా గా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జీఎస్టీ ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయి అనే లెక్కలు బయటకు వచ్చాయి . మరి దాని ప్రకారం పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జీఎస్టీ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినట్లు తెలుస్తోంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం భారతదేశ జిఎస్టి 4.6 శాతం హై కి వచ్చింది.

ఇందులో పోయిన సంవత్సరం ఒక లక్షా 32 వేల కోట్లు వస్తే, ఈ సంవత్సరం 1,38,906 కోట్లు వచ్చినట్లు తెలుస్తుంది. ఇలా పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం జీఎస్టీ ద్వారా వచ్చిన డబ్బుల శాతం భారీగానే పెరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో జీఎస్టీ పన్నులతో వచ్చిన డబ్బుల్లో  ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ జిఎస్టి పెరుగుదలలో 0% గ్రోత్ ను చూపించినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం లో మాత్రం జిఎస్టి వసూళ్లు 8 శాతం గ్రోత్ ను సాధించింది.

గ్రోత్ పరంగా చూసుకుంటే నేషనల్ గ్రోత్ కంటే కూడా తెలంగాణ గ్రోత్ అధికంగా ఉంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పోయిన సంవత్సరం జీఎస్టీ ద్వారా  3651 కోట్లు వస్తే, ఈ సంవత్సరం 3634 కోట్ల రూపాయలు జిఎస్టి ద్వారా ఆంధ్రప్రదేశ్ కు వచ్చాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి పోయిన సంవత్సరం జిఎస్టి ద్వారా 4716 కోట్ల రూపాయలు వస్తే, ఈ సంవత్సరం 5111 కోట్ల రూపాయలను సాధించి ఎనిమిది శాతం గ్రోత్ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

gst