అనుమానం పెనుభూతమై ఓ కుటుంబాన్ని నాశనం చేసింది. సాధారణంగా భార్య భర్తల మధ్య మనస్పర్థలు చిన్న అనుమానం తలెత్తిన మంచి కాదని చెబుతున్నారు. ఇక ఒక్కసారి వారిలో అనుమానం నాటుకుంటే ఆ కాపురంలో కలతలు వస్తూనే ఉంటాయి. ఇక అనుమానం పెను భూతంగా మారి చివరికి ప్రాణాలు తీయడానికైనా, తీసుకోవడానికైనా వెనుకాడరు. తాజగా హర్యానాలోని పానిపట్‌ జిల్లాలో ఉన్న సివాహ్ గ్రామంలో ఇదే కోవలో ఓ ఘటన చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పానిపట్ జిల్లాలోని సివాహ్ గ్రామానికి చెందిన రమేష్ కడియన్ అలియాస్ మాస్సే(28) ఢిల్లీకి చెందిన ప్రాపర్టీ డీలర్‌ పద్మ పన్వర్ వద్ద బౌన్సర్‌గా పని చేస్తున్నాడు. అయితే ఢిల్లీలోని లాక్‌డౌన్ కొనసాగుతున్న కారణంగా దాదాపు నెలన్నర నుంచి భార్య అనుతో కలిసి సొంతూరికి వెళ్ళాడు. ఇరిద్దరికి సంవత్సరం వయసున్న కవీష్ అనే బాబు ఉన్నాడు. ఇక అంతా బాగానే ఉన్నట్టు అనిపిస్తున్నప్పటికీ భార్యాభర్తల మధ్య కొన్ని రోజులుగా మనస్పర్థలు తలెత్తున్నాయి..

అయితే బౌన్సర్ అయిన తన భర్త వేరే ఎవరితోనో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అను మనసులో సందేహం వచ్చింది. ఇక ఆమె సందేహం కాస్తా సంసారంలో కలతలు మొదలయ్యాయి. ఇక భర్తను అనుమానిస్తూ రోజూ అను గొడవ పెట్టుకుంటూ ఉండేది. అయితే తనకు ఎవరితోనూ సంబంధాలు లేవని చెప్పినా ఆమె నమ్మలేదు. ఇక భార్య ప్రవర్తనతో కొన్నిరోజులుగా రమేష్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. తన సంవత్సరం వయసున్న బాబుతో సంతోషంగా గడుపుతున్న ప్రతిసారి అను తీరు రమేష్‌కు ఇబ్బంది కలిగిస్తూ ఉండేది.

ఇక ఢిల్లీ నుంచి సొంతూరు వెళ్లాక అను భర్తను మరింతగా అనుమానించడం మొదలుపెట్టింది. స్వగ్రామంలో ఏ అమ్మాయి అతనితో చనువుగా పలకరించినా ఆమె అనుమానంగా చూసేది. ఇక భార్య ప్రవర్తనతో విసిగిపోయిన రమేష్ క్షణికావేశంలో ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన భార్యను, కొడుకుని చంపేసి అతను రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: