ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. 40 ఏళ్లుగా పాములు పట్టడంలో అతనికి తిరుగులేదు అని చెప్పాలి. ఇప్పటివరకు వేల పాములను పట్టాడు. కాని చివరికి ప్రాణాలు వదిలాడు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ వార్త కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇండోర్‌లోని భగత్ సింగ్ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అశోక్ మేవాడ అనే 57 ఏళ్ల వ్యక్తి దాదాపు 40 ఏళ్ల నుంచి ఎంతో ప్రమాదకరమైన పాములు ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. దీంతో ఇంట్లోకి పాము వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఫోన్ చేస్తూ ఉంటారు.
ఇటీవల సుమన్ నగర్ లోని ఒక వ్యక్తి అశోక్ ఫోన్ చేసి తమ ఇంట్లో పాము ప్రవేశించింది అని చెప్పాడు. ఎప్పటిలాగానే అశోక్ అక్కడికి వెళ్లి పాముని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. అది కాటు వేసింది. అయినప్పటికీ పట్టువిడవకుండా అశోక్ పామును పట్టుకునీ మరో చోట వదిలేశాడు. అయితే తన శరీరం నుంచి కొంత విషయాన్ని స్వయంగా తొలగించాడు. ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి చేరుకున్న తర్వాత పరిస్థితి విషమించింది.. కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే విషం శరీరమంతా వ్యాపించడంతో పొందుతూ మృతి చెందాడు. ఇలా పాములు పట్టే వ్యక్తి అదే పాముకాటు చనిపోవడంతో అతనీ మృతి స్థానికంగా సంచలనంగా మారింది.