ఇటీవలి కాలంలో ఆడపిల్లలపై జరుగుతున్న అత్యాచార ఘటనలు ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు అన్న విషయం తెలిసిందే. ఆడ పిల్లలను లైంగికంగా వేధించిన వారిని శిక్షించేందుకు  ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన ఎంత దారుణమైన శిక్షలు విధించినా అటు కామాంధులలో మాత్రం భయపడటం లేదు. మరింత రెచ్చిపోతూ ఆడపిల్లలపై అఘాయిత్యాలు పాల్పడుతున్నారు. వెరసి రోజు రోజుకి వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే ప్రతి ఆడపిల్ల భయంతో వణికి పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పాలి. మొన్నటి వరకు పరాయి వ్యక్తుల నుంచి మాత్రమే ఆడపిల్ల లైంగిక వేధింపులు ఎదుర్కొనే వారు కానీ ఇప్పుడు సొంత వారి నుంచి కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు.


 అయితే ఇలా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారికి అటు కోర్టులు కూడా కఠినమైన శిక్షలు విధిస్తూ ఉండడం గమనార్హం. ఇటీవల కాలంలో ఎంతోమంది లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న వారికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించడం లేదా ఉరిశిక్ష ఖరారు చేయడం లాంటి తీర్పు వెలువరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక కోర్టు అత్యాచార నిందితుడికు కఠిన శిక్ష విధించడం గమనార్హం.2017 లో జరిగిన అత్యాచారం కేసులో గత ఐదేళ్ల నుంచి విచారణ కొనసాగుతూనే వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవలే అన్ని ఆధారాలను పరిశీలించిన కోర్టు నిందితుడికి  ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.


 ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పట్టణంలోని కెసిఆర్ నగర్ కాలనీలో 2017 సంవత్సరం లో బాలికపై అత్యాచారం జరిగింది. ఈ క్రమంలోనే వల్లూరి ప్రభాకర్ అనే వ్యక్తిని అత్యాచారం కేసులో అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఈ కేసుపై విచారణ జరిపి అన్ని ఆధారాలను సమర్పించి నిందితుడ్ని కోర్టులో సమర్పించారు. కాగా ఈ కేసు విచారణ 2017 నుంచి కొనసాగుతూ వస్తోంది. ఇటీవలే విచారణ  ముగిసింది. జిల్లా అదనపు జడ్జ్ అయిదేళ్లు నిందితుడికి కఠిన కారాగార శిక్షతో పాటు 5వేల జరిమానా విధిస్తూ తీర్పు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అయితే నిందితుడికి శిక్ష పడిందని ఆనందపడిన నిందితుడూ పై కోర్టుకు వెళ్లే అవకాశం కూడా లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: