మనిషి జీవనశైలిలో నేటి ఆధునిక కాలంలో ఎన్ని మార్పులు వస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక పాశ్చాత్య అలవాట్లు భారతదేశంలో రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలా పాశ్చత్య దేశాల అలవాట్లు చివరికి ఎంతోమందిని బానిసలుగా మార్చుకుంటూ చెడుతోవలో నడిపిస్తున్నాయి అని చెప్పాలి  ఒకప్పుడు ఒక అమ్మాయిని చూసిన తర్వాత ప్రేమించడం పెళ్లి చేసుకోవడం లాంటివి చేసేవారు. లేదంటే పెద్దలు చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా జరిగేవి. కానీ ఇటీవల కాలంలో మాత్రం ఆన్లైన్ డేటింగ్ యాప్ల ద్వారా ఎంతో మంది అమ్మాయిలతో పరిచయం పెంచుకొని మోసాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అంతేకాకుండా డేటింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది అమ్మాయిలు స్వీట్ గా మాట్లాడుతూ ఎరవేసి చివరికి అందిన కాడికి దోచుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్. ఇలా చివరికి డేటింగ్ యాప్ల కారణంగా మోసపోతున్న ఎంతోమంది పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలంటూ కోరుతున్నారు. ఇక ఇటీవల హైదరాబాద్కు చెందిన వైద్యుడి కి డేటింగ్ యాప్ ద్వారా ఊహించని రీతిలో షాక్ తగిలింది అని చెప్పాలి. సైబర్ నేరగాలు అటాక్ చేయడంతో చివరికి ఖాతా మొత్తం ఖాళీ అయిపోయింది. హైదరాబాద్ కు చెందిన ఓ వైద్యుడు డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే యాప్ నిర్వాహకులు ఇక అతని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు.


 కొన్ని రోజులపాటు అందమైన అమ్మాయిలతో చాటింగ్ కాల్స్ చేయించి మాట్లాడించడం లాంటివి చేశారు. ఇక అమ్మాయిలతో డేటింగ్ చేయించాలి అంటే రిజిస్ట్రేషన్ కోసం కొంత మొత్తం చెల్లించాలి అంటూ ఒక బ్యాంకు ఖాతా ఇచ్చారు.  ఇక ఆ డేటింగ్ యాప్ కి బానిసగా మారిపోయిన వైద్యుడు మూడు దఫాలుగా 1.5  కోట్ల రూపాయలను పంపాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మోసపోయాను అన్న విషయాన్ని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: