హైదరాబాద్ నగరంలో ఎన్నో కులాలకు మతాలకు నిలయంగా ఉన్న సంగతి తెలిసిందే.. అలాగే అసాంఘిక కార్యకలాపాలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. ఒకవైపు వ్యభిచారం రెక్కలు విప్పుతుంది. మరోవైపు మద్యం వీకెండ్ వస్తే ఎరులై పారుతుంది. ఇప్పుడు పేకాట జొరుగా సాగుతోంది.. హైదరాబాద్‌ మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని పేకాట డెన్‌పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 8 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పక్కా సమాచారం తో పోలీసులు రైడ్‌ చేశారు. 8మంది పేకాట ఆడుతుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారంతా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులగా పోలీసులు గుర్థించారు. అంతేకాదు ప్రజా ప్రతినిధి కూడా వున్నట్లు తెలుస్తుంది. ప్రజాప్రతినిధిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.. అయితే పోలీసులు మాత్రం వారికి పట్టుబడిన వారి వివరాలను మీడియా కు వెల్లడించారు.. శ్రీనివాస్‌, గోవర్ధన్‌, వెంకటేశ్వర్‌ రెడ్డి, శ్రీకాంత్‌, సౌజన్య, వసంత, వందన ఉన్నారని తెలిపారు.. పట్టుబడ్డ వారిలో ప్రజాప్రతినిధులెవరూ లేరని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.


మాదాపుర్ అయ్యప్ప సొసైటీ లోని కాకతీయ హిల్స్ లోని ఓ బిల్డింగ్ లో 8 మంది పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో రైడ్ చేశారు. పోలీసులకు వచ్చిన సమాచారం నిజమని తేలింది.8 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 90 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.. ఆ ఫ్లాటు ఎవరి పేరు మీద వుందో అతను కూడా నింధితుడుగా ఉన్నారు. పట్టుబడ్డ వారందరూ నగరం లోని పలు ప్రాంతాలకు చెందినవారని గుర్తించామని పోలీసులు తెలిపారు. అంతేకాదు వారంతా బిల్దర్స్ కావడం విశేషం..గతంలో కూడా ఆ ప్రాంతం లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసాయని పోలీసులు తెలిపారు. పండగ సీజన్ కావడం తో పేకాట ఆడుతూ బిజిగా ఉన్నారు. వీరిని విచారణ అనంతరం స్పెషల్ కోర్టుకు తరలించనున్నట్లు తెలుస్తుంది..




మరింత సమాచారం తెలుసుకోండి: