ఇటీవల కాలంలో ప్రతి వస్తువు కూడా కల్తీ మయం అయిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే కేవలం వాడే వస్తువులు మాత్రమే కాదు తినే ఆహారం కూడా నేటి రోజుల్లో కల్తీ అవుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పైకి ఎంతో రుచికరమైన ఆహారం అని చెబుతున్న.. ఇక అక్కడ జరిగే కల్తీ గురించి తెలిసి మాత్రం ఎంతో మంది ఆశ్చర్యపోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా చికెన్ బిర్యానీ పేరుతో ఏకంగా కుక్కల మాంసంతో బిర్యాని చేసి పెట్టిన ఘటనలు కూడా గతంలో వెలుగులోకి వచ్చి అందరిని అవాక్కయ్యేలా చేసాయి.


 ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు మరోసారి బిర్యానీ తినాలి అని ఆలోచన వస్తేనే భయపడే పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా ఘటనలు ఎన్నో రెస్టారెంట్లలో జరుగుతూ ఉన్నాయి. చికెన్ బిర్యానీ పేరుతో కుళ్ళిపోయినా మాంసం పెడుతూ ఉండడం కూడా అప్పుడప్పుడు వెలుగులోకి వస్తుంది. ఇక్కడ జరిగిన ఘటన మాత్రం మరింత విచిత్రమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఏకంగా ఇక్కడ ఒక రెస్టారెంట్ కి వెళ్లి చికెన్ బిర్యాని ఆర్డర్ చేశారు అంటే ఏకంగా చికెన్ బిర్యాని కి బదులు పావురాల బిర్యానీ ఇస్తారు.


 ఇక ఇది కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. చికెన్ బిర్యాని పేరుతో పావురాల బిరియాని పెడుతున్నారు అంటూ ఒక రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అని చెప్పాలి. అభిషేక్ అనే వ్యక్తి తన అపార్ట్మెంట్లో పావురాలను పెంచి డ్రైవర్ సహాయంతో వాటిని ముంబాయిలోనే బార్ అండ్ రెస్టారెంట్ కు అమ్ముతున్నాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు రిటైర్డ్ ఆర్మీ కెప్టెన్ హరీష్. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అపార్ట్మెంట్ మేనేజ్మెంట్ సభ్యులను కొంతమందిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: