
విధి ఆ కుటుంబం విషయంలో పగబడినట్లుగా వ్యవహరించడంతో చివరికి ఊహించని రీతిలో కొడుకు ప్రాణం పోయింది. ఏకంగా తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా కొడుకు కూడా ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పాలి. అప్పటికే తండ్రినీ మృత్యువు బడిలోకి చేర్చిన విధి.. కొడుకుని శోకంలో ముంచేసింది. అయితే అరణ్య రోధనుగా విలపిస్తూనే తండ్రి అంత్యక్రియలు చేయడం మొదలుపెట్టాడు కొడుకు. ఇలాంటి సమయంలో మరో అనూహ్య ఘటన జరిగింది. తండ్రి అంత్యక్రియలు జరుగుతుండగా ఏకంగా ఊహించని రీతిలో కొడుకు ప్రాణాలు కూడా పోయాయి.
ఈ విషాదకర ఘటన ఒడిశా లోని కోరాపూర్ జిల్లా బోరిగుమ్మ బ్లాక్ లోని కంద గ్రామంలో వెలుగులోకి వచ్చింది. ఇలా తండ్రి అంత్యక్రియలు నిర్వహిస్తుండగా.. అనూహ్య రీతిలో మృతి చెందిన వ్యక్తి బెనుదర్ మొండల్ గా గుర్తించారు. అతని తండ్రి లక్ష్మణ్ మొండల్ అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అయితే కొడుకుగా ఇక తండ్రి అంత్యక్రియలను సాంప్రదాయం ప్రకారం పూర్తి చేస్తున్నాడు. ఇంతలోనే ఒక చెట్టుకొమ్మ విరిగి అతనిపై పడింది. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. కానీ యువకుడు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇలా తండ్రి అంత్యక్రియల్లో కొడుకు కూడా మృతి చెందడంతో ఆ కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది.