ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు భర్త కోపంతో భార్యపై చేయి చేసుకోవడం జరుగుతూ ఉండేది. సినిమాల్లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా భార్యాభర్తల బంధం లో ఇలా మెయిల్ డామినేషన్ ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారు అయింది. ఎందుకంటే ఫిమేల్ డామినేషన్ పెరిగిపోయింది. కేవలం సినిమాల్లో, మీమ్స్ లో చూడటం కాదు . అటు రియల్ లైఫ్ లో కూడా ఇదే జరుగుతుంది అని ఎంతో మంది భర్తలు చెబుతూ ఉంటారు. ఏకంగా భర్తల పైన భార్యలు చేయి చేసుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి.


 ఇక్కడ జరిగింది కూడా ఇలాంటి కోవలోకి చెందిన ఘటనే. కట్టుకున్న భర్త పైన ఒక మహిళ దాడి చేసింది  దాడి అంటే అలాంటి ఇలాంటి దాడి కాదు.. ఏకంగా అతని తల పగలగొట్టేస్తుంది భార్య. అంత కోపంతో తల పగలగొట్టింది అంటే అతను ఏదో పెద్ద తప్పు చేసే ఉంటాడు అనుకుంటున్నారు కదా. కానీ ఆమె అలా చేయడానికి గల కారణం ఏంటో తెలిస్తే మాత్రం ముక్కున వేలేసుకుంటారు. ఎందుకంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనే కోపంతో ఏకంగా భర్త తలను పగలగొట్టింది ఆ భార్య. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.


 రాంపూర్ లోని షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కరేటి గ్రామానికి చెందిన మనోజ్, భవిత అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. అయితే మనోజ్ హెయిర్ కటింగ్ కోసం సెలూన్ కు వెళ్లాడు. కటింగ్ చేయించుకుంటున్న సమయంలో అతని భార్య భవిత అతనికి ఫోన్ చేసింది. అయితే కటింగ్ చేయించుకుంటూ ఉండటంతో అతను ఫోన్ లిఫ్ట్ చేయలేదు. ఇక దీంతో ఎక్కువసార్లు కాల్ చేసిన భార్య భర్తపై కోపం పెంచుకుంది. ఇక మనోజ్ కటింగ్ చేయించుకుని ఇంటికి వెళ్ళాడు.  ఫోన్ లిఫ్ట్ చేయలేదు అనే కారణంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న భవిత అతనితో ఘర్షణకు దిగింది. మాట మాట పెరగడంతో మరింత కోపోద్రిక్తురాలు అయిన భవిత పక్కనే ఉన్న ఇటుక తీసుకొని మనోజ్ తలపై బలంగా కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయం అయింది. వెంటనే ఆసుపత్రికి వెళ్ళాడు. అతనికి వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఇక మనోజ్ నేరుగా వెళ్లి భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సమస్పూర్తిగా వ్యవహరించి ఇక కౌన్సిలింగ్ ఇచ్చి దంపతులిద్దరినీ కూడా కలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: