కాశ్మీర్లో ఆర్టికల్ 370 35ఏ రద్దు తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయి. తిరిగి అందమైన, అల్లర్లు లేని ప్రశాంతమైన కాశ్మీర్ భారత్ కు దక్కింది. అయితే కాశ్మీర్ తమదేనని భావిస్తూ  కాశ్మీర్లో ఇప్పుడు నెలకొన్న ప్రశాంతతను చెడగొట్టడానికి పాకిస్తాన్ కుట్రలు పన్నుతుంది.  దీనిలో భాగంగానే హిజ్బుల్ మొజాహిద్దీన్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలను భారత్ పైకి పంపింది ఇప్పటికే పాకిస్తాన్.


అవి తమ ఇస్లాం మత రాజ్య స్థాపన కోసమే ఎంతకైనా తెగించి పనిచేసే సంస్థలు. కాబట్టి వాటిని ఈ దుశ్చర్యల కోసం పురిగొల్పుతుంది పాకిస్తాన్. అయితే ఇలాంటి ఉగ్రవాద సంస్థలన్నిటిని భారత సైన్యం తుడిచి వేస్తుంది. కాబట్టి మరింత కొత్తగా,  బలంగా వ్యూహాలు పన్నుతోంది. అయితే విడివిడిగా ఉంటే తమ ఉగ్రవాద సంస్థలను భారత సైన్యం అణిచివేస్తుంది అని ఆలోచించిన పాకిస్తాన్ కొత్త దారిలో పథకాలు రచించడం మొదలుపెట్టింది.


దానిలో భాగంగానే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే పేరుతో చిన్నాచితక ఉగ్రవాద సంస్థలన్నిటినీ కలిపి ఒక సంస్థగా మార్చి భారత్ పైకి వదలబోతుంది. ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్ అనే ఉగ్రవాద సంస్థల కూటమి లో చిన్నాచితకా సంస్థలు 44 వరకు ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనిలో ఉండే సభ్యులు ప్రాణాలకు తెగించి, ఆత్మాహుతి దాడులకు పాల్పడే విధంగా శిక్షణ పొందారని తెలుస్తుంది. ఈ కూటమి కొట్టిన దెబ్బే మొన్న భారత్ సైన్యంలో ముగ్గురు చనిపోవడం.


వీళ్ళు దాడి చేసేటప్పుడు చాలా వ్యూహాత్మకంగా చేస్తారని అంటారు. ముందుగా వాళ్లు సైన్యంలో ఎవరితోనైనా గొడవ పడతారట. అది చూసి దాడి చేయడానికి వెళ్ళిన సైన్యాన్ని వెనక నుండి దెబ్బ కొడతారట. ఈ రాక్షస దాడులకు ప్రధాన లక్ష్యం భారత సైనికులను భయపెట్టడం అని తెలుస్తుంది. కాశ్మీర్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి అంటూ ప్రపంచాన్ని నమ్మించడానికి చేస్తున్న కుట్ర. అంతే కాకుండా కాశ్మీర్ తమదేనని ప్రపంచ దేశాలకు చెప్పడం. మరి దీనిపై భారత్ ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: