ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత హఠాత్తుగా పశ్చిమబెంగాల్లో అల్లర్లు మొదలయ్యాయి. అల్లర్లకు మీరు కారణమంటే కాదు మీరే కారణమని గెలిచిన తృణమూల్ కాంగ్రెస్, ఓడిపోయిన బీజేపీ నేతలు ఒకరిపై మరొకరు తీవ్రస్ధాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇదే సందర్భంగా బెంగాల్లో జరిగిన అల్లర్లంటు చాలా ఫొటోలు సోషల్ మీడియాలో సర్క్యులేషన్లో ఉన్నాయి. తమ నేతలు, కార్యకర్తలపైనే కాకుండా వాళ్ళ ఇళ్ళపైన కూడా తృణమూల్ నేతలు దాడులు జరిపి విధ్వంసాలు చేస్తున్నారంటూ బీజేపీ నేతలు నానా గోల చేసేస్తున్నారు. సందట్లో సడేమియా అన్నట్లుగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కోలకత్తాకు చేరుకుని  అగ్నికి మరింత ఆజ్యం పోస్తున్నారు. దాంతో శాంతి భద్రతలు మరింతగా క్షీణిస్తున్నాయి.




బెంగాల్లో గొడవలపై రెండు పార్టీలు పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్న కారణంగా వాస్తవం ఏమిటి ? అల్లర్లకు ఎవరు కారకులు అనే విషయాలపై బయటవాళ్ళకు క్లారిటి రావటంలేదు. అయితే ఒకటి మాత్రం నిజమని నమ్మాలి. అదేమిటంటే ఎక్కడైనా ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు మంచి ఉత్సాహంతో, ఊపుమీదుంటారు. ఓడిపోయిన వాళ్ళు బాధతోను కొన్నిసార్లు కోపంతో కూడా ఉంటారు. గెలిచిన అభ్యర్ధికి కానీ లేదా పార్టీకికానీ ఓడిపోయిన అభ్యర్ధిమీదో లేకపోతే ఓడిపోయిన పార్టీమీదో దాడులు చేయాల్సిన అవసరం ఉండదు. ఓడిపోయిన అభ్యర్ధే బాధతోనే లేదా కోపంతోనో ఉంటాడు కాబట్టి గెలిచిన వాళ్ళపైన దాడి చేయటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పటివరకు దేశంలో ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడ గొడవలు జరిగినా ఇదే పద్దతి. గెలిచిన అభ్యర్ధి, ఓడిపోయిన అభ్యర్ధి ఎదురుపడినపుడు ఏదైనా ఆవేశకావేశాలకు దిగితే అప్పుడు ఇద్దరు ఒకరిపై మరొకరు గొడవకు దిగే అవకాశం కూడా ఉంది.




ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బెంగాల్లో అల్లర్లంటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోల్లో దాదాపు అబద్ధాలే అని తేలుతోంది. ఇపుడు సర్క్యులేట్ అవుతున్న ఫొటోల్లో అత్యధికం గతంలో ఎప్పుడో జరిగిన ఘటనలకు సంబంధించినవని క్వింట్ అనే వెబ్ సైట్ బయటపెట్టింది. అలాగే సిటిజన్ షిట్ అమెడ్మెంట్ యాక్ట్ (సీఏఏ) అమలు చేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినపుడు నిరసనగా జరిగిన అల్లర్ల తాలూకు ఫొటోలు, వీడియోలను కూడా ఇప్పటి అల్లర్లుగా బీజేపీ ప్రచారం చేస్తోందంటు తృణమూల్ నేతలు ఎదరుదాడికి దిగుతున్నారు. మొత్తానికి ఇపుడు వైరల్ అవుతున్న ఫొటోలు, వీడియోల్లో చాలావరకు తప్పుడవే అని తేలిపోయింది. కాబట్టి అల్లర్ల ఫొటోల్లో ఏది కరెక్టో తెలియక సింపుల్ గా అల్లర్లకు నిరసనగా దీక్ష చేస్తున్న ఏపి బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఫొటోను మాత్రమే చూపెడుతున్నాం.

మరింత సమాచారం తెలుసుకోండి: