ఏపీ అసెంబ్లీలో తన భార్యను అవమానపరిచారంటూ చంద్రబాబు ఇటీవల మీడియా ముందు వెక్కి వెక్కి ఏడ్చిన సంఘటన తాలూకు ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చంద్రబాబు ఏడుపు కారణమైన ఘటనలపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అయితే.. చంద్రబాబు ఏమీ తక్కువ వాడు కాదని.. ఆయన చరిత్ర ఏంటో అందరికీ తెలుసని ఆయన అంటే గిట్టని వాళ్లు చెబుతున్నవాదన.. ఈ సందర్భంగా గతంలో జరిగిన కొన్ని సంఘటనల కూడా చర్చకు వస్తున్నాయి.


అప్పట్లో ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీ పెట్టేందుకు సహకరించిన నాదెండ్ల భాస్కర్ రావు.. ఈ విషయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తాను, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన రోజులను ఆయన గుర్తు చేసుకున్నారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారన్న సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన కాంగ్రెస్ తరపున సినిమాటో గ్రఫీ మంత్రిగా కూడా పని చేశారు. అయితే.. ఎన్టీఆర్ పార్టీకి మంచి ఆదరణ దక్కుతుండటంతో తెలుగు దేశంలోకి వచ్చేందుకు చంద్రబాబు ఆసక్తి చూపారు. అయితే చంద్రబాబు ప్రతిపాదనకు మొదట్లో ఎన్టీఆర్ అంత సుముఖంగా లేరట.


కానీ.. చంద్రబాబు.. టీడీపీలో చేరేందుకు తన భార్య భువనేశ్వరి ద్వారా ఎన్టీఆర్‌పై ఒత్తిడి తెచ్చారట. చంద్రబాబు భార్య భువనేశ్వరి ఎన్టీఆర్ చిన్న కూతురు అన్న సంగతి తెలిసిందే. అందుకే చివరకు ఎన్టీఆర్ కూతురు కోసం చంద్రబాబును పార్టీలో చేర్చుకోవాల్సి వచ్చిందట. ఈ విషయాలను నాదెండ్ల తాజాగా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. అంతే కాదు.. అప్పట్లో ఎన్టీఆర్‌ చెక్కులు పాస్‌కాకుండా చంద్రబాబు చేశాడని నాదెండ్ల విమర్శించారు.


ఎన్టీఆర్ చివరి రోజుల్లో అందరూ మోసం చేశారని ఏడ్చారని నాదెండ్ల భాస్కర్ రావు గుర్తు చేశారు. ఎన్టీఆర్‌కు తన పిల్లలు అన్నం కూడా పెట్టలేదని.. తినడానికి భోజనం కూడా లేదని ఎన్టీఆర్‌ ఏడ్చారని నాదెండ్ల గుర్తు చేసుకున్నారు. ఏపీ అసెంబ్లీలో తాజాగా జరిగిన గొడవలపైనా నాదెండ్ల భాస్కరరావు స్పందించారు. తాను అసెంబ్లీ వీడియోలు చూశానని.. కానీ.. ఎక్కడా వైసీపీ ఎమ్మెల్యేలు.. చంద్రబాబు భార్యను అన్నట్టుగా లేదని అన్నారు నాదెండ్ల.


మరింత సమాచారం తెలుసుకోండి: