కానీ.. ఆ తర్వాత సీన్ మరింత మారిపోయంది. కేసీఆర్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాదు.. జాతీయ స్థాయిలో బీజేపీని ఏకడం ప్రారంభించారు. గత కొద్ది రోజులుగా ఇది మరింత పతాక స్థాయికి చేరింది. మోడీని తరిమి తరిమి కొడతారు. బీజేపీని ఈ దేశం నుంచే వెళ్లగొట్టాలి అనే రేంజ్‌కు కేసీఆర్ వాయిస్ వెళ్లిపోయింది. మరి ఇంతగా కేసీఆర్ ఎందుకు బీజేపీని, మోడీని టార్గెట్ చేస్తున్నారు.. ఆయన ఎత్తుగడ ఏంటి అన్నది ఇప్పుడు పొలిటికల్ సర్కిళ్లో హాట్ టాపిక్ అయ్యింది.
అదే సమయంలో ఆయన కాంగ్రెస్ హైకమాండ్‌పై సాఫ్ట్ కార్నర్‌లో వెళ్తున్నారు. ప్రత్యేకించి రాహుల్ గాంధీపై అస్సాం సీఎం చేసిన అనుచిత వ్యాఖ్యల విషయంలో కేసీఆర్ బాగా రియాక్టయ్యారు. రాహుల్ గాంధీ వంశాన్ని బాగా పొగిడారు. అలాంటి చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి మీద ఇలాంటి వ్యాఖ్యలా అంటూ విరుచుకు పడ్డారు. ఈ వ్యవహారం చూస్తుంటే... కొంపదీసి కేసీఆర్ కాంగ్రెస్‌కు దగ్గరవుతున్నారా.. అన్న అనుమానాలు కూడా వచ్చాయి. ఇదే విషయంపై కేసీఆర్ నిన్న వివరణ కూడా ఇచ్చారు.. కాంగ్రెస్ తో పొత్తు ఉండే ప్రసక్తి లేదని.. కానీ బీజేపీ నేతల అనుచిత వ్యాఖ్యలను ఓ మనిషిగా ఖండించకుండా ఉండలేనని వివరణ ఇచ్చారు.
మరి ఇంతకీ కేసీఆర్ ఎత్తుగడ ఏంటి.. పోనీ.. తృతీయ ఫ్రంటా అంటే అబ్బే అదేమీ కాదు.. ప్రజల ఫ్రంట్ కావాలి అంటూ డైలాగులు కొడుతున్నారు.. ఏమో ఎవరు నాయకత్వం వహిస్తారో ఎవరు చెబుతారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మొత్తానికి కేసీఆర్ చూపు ఢిల్లీ రాజకీయాలపై బలంగా పడింది. కానీ.. ఎలా ముందుకు వెళ్లాలన్న అంశంపై ఆయనకే ఇంకా క్లారిటీ వచ్చినట్టు లేదు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి