
దీనికి బోరిస్ జాన్సన్ ఖండించారు. వర్క్ ఎక్స్టెన్షన్ లో భాగంగానే అక్కడ ఆ విధమైన పరిస్థితిలో ఉండాల్సి వచ్చింది అన్నారు. ఇలా కొన్ని కారణాలు చెప్పారు. అయితే బ్రిటన్ లో ప్రస్తుతం దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. పార్లమెంట్లోని ఏడుగురుసభ్యులు కలిపి ఎక్కడ పొరపాటు జరిగింది. ఎక్కడ పార్టీ గేట్ వివాదం మొదలైంది. ఎవరు దీనికి కారకులు అనే దానిపై పూర్తి ఆధారాలు సమర్పించారు. దీనిపై శిక్ష ఖరారు కావలసింది ఉంది.
ప్రస్తుతం ప్రధానిగా ఉన్న రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ ఒకే పార్టీకి చెందిన వారు కావడంతో వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే బోరిస్ జాన్సన్ చేసినటువంటి పొరపాటు క్షమించరానిదిగా పేర్కొంటున్నారు. కరోనా సమయంలో భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వమే అందరిపై ఆంక్షలు విధించింది. కానీ స్వయాన ప్రధానమంత్రి అలాంటి ఆంక్షలని పెడచెవిన పెట్టడం అనేది పెద్ద తప్పుగా పరిగణిస్తున్నారు.
ఒకవేళ జాన్సన్ కు శిక్ష ఖరారు అయితే ఏ విధమైన శిక్ష పడుతుంది. ఎంత కాలం జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఒక మాజీ ప్రధానమంత్రి కి శిక్ష వేయాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందనేది చూడాలి. మరి రిషి సునాక్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.