మచిలీ పట్నం పోర్టు ను యాంకరేజ్ పోర్టుగా వాడుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పోర్టును ఆ మధ్య కోరింది. కానీ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఓపెన్ టెండర్ లో పాల్గొనండి కానీ డైరెక్టుగా ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. యాంకరేజ్ పోర్టు అంటే సముద్రం తమ ప్రదేశంలో లేనపుడు వేరే దేశంలో, వేరే రాష్ట్రంలో ఉన్న పోర్టు ను తమ ఆధీనంలోకి తీసుకుని కార్యకలాపాలను నడిపించడం.


భూటాన్ దేశానికి సముద్ర సరిహద్దు లేదు. దీంతో భూటాన్ ఇప్పుడు యాంకరేజ్ పోర్టులపై దృష్టి సారించింది. భారత్ ఓడరేవుల నుంచే భూటాన్ కు సరకులు సరఫరా అవుతుంటాయి. బంగ్లాదేశ్ కూడా భూటాన్ కు దగ్గరగానే ఉంటుంది. బంగ్లాదేశ్ యాంకరేజ్ పోర్టుల కోసం భూటాన్ అడిగితే ఓకే అంది. భారత్ ఓడరేవుల నుంచి భూటాన్ కు సరకులు చేరాలంటే దాదాపు 260 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లాల్సి ఉంటుంది. దీని వల్ల రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నట్లు భూటాన్ భావించింది.


దీంతో బంగ్లాదేశ్ లో యాంకరేజ్ పోర్టుల వల్ల భూటాన్ కు ఖర్చు తగ్గే అవకాశం ఉందని భావించింది. బంగ్లాదేశ్ లో ఏర్పాటు చేసుకున్న యాంకరేజ్ పోర్టులతో కేవలం 60 కిలోమీటర్ల దూరం మాత్రమే వస్తుందని దీంతో రవాణ ఖర్చులు తగ్గి సరకులు తక్కువ ధరకు వచ్చే అవకాశం ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూటాన్ భారత్ మీదే కాకుండా వేరే దేశాల మీద కూడా ఆధారపడుతోందని ఈ నిర్ణయం వల్ల వెల్లడవుతోంది.


మంగోలియా, చిట్టగాంగ్, లాంటి ప్రాంతాల్లో ఉన్న పోర్టులను యాంకరేజ్ పోర్టులుగా తీసుకుని భూటాన్ తనపై పడుతున్న భారాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో భారత్ నుంచి సరకుల రవాణా తగ్గడంతో మన దేశంతో ఉన్న సంబంధం కూడా దూరమయ్యే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతాలను కూడా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చని భూటాన్ నిరూపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: