పోలాండ్ ఉక్రెయిన్ కి పక్కన ఉంది. రష్యా ఉక్రెయిన్ ని స్వాధీనం చేసుకుంటే ఆ తర్వాత తనపైకే వస్తుంది అన్న భయం ఉంది. అందుకే రష్యా పై జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్  గెలవాలని కోరుకుంటుంది అది. తాను నాటో సభ్యురాలు కాబట్టి నాటో దేశాలన్నిటిని కూడా ఉక్రెయిన్ కి తోడుగా ఉండాలని, రష్యాపై యుద్ధానికి వెళ్లాలని పురమాయిస్తుంది. కానీ ఆ దేశాలేవీ కూడా రష్యా పై యుద్ధానికి వెళ్లడానికి సిద్ధంగా లేవు పోలాండ్, స్లోవేకియా తప్పించి.


అందులోనూ సరిహద్దుల్లో  గొడవలు ఉంటే కనుక నాటోలో అసలు సభ్యత్వమే ఉండదనే రూల్ కూడా ఉంది. అందుకని ఏ దేశం కూడా రష్యా పైకి యుద్ధానికి రెడీగా లేవు. అందుకనే ఉక్రెయిన్ కి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు జర్మనీని అత్యధిక అత్యాధునిక ఆయుధాలు ఇవ్వమంటే ఇవ్వనంది, యుద్ధ విమానాలు ఇలాంటివి ఇవ్వమన్నా ఇవ్వనంది. పోలాండ్ మాత్రం తన దగ్గర ఉన్న మిగ్గులు ఇలాంటివన్నీ దాని మొహాన పడేసింది.


ఇప్పుడు జర్మనీని అత్యాధునిక ఆయుధాలు ఇవ్వమని అమెరికా ఫోర్స్ చేస్తుంది ఇంకా పోలాండ్ ని కూడా ఫోర్స్ చేస్తుంది. అయినా సరే జర్మనీ మాత్రం అత్యాధునిక ఆయుధాలు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకని అంటే ఈ ఆయుధాలు తీసుకొని  రష్యాపై దాడి చేస్తే కనుక, అది తన దేశం పైనే దాడి చేసినట్టు అవుతుంది. అది కొనుక్కుంటే వేరు కానీ ఫ్రీగా ఇచ్చినప్పుడు అదే అవుతుంది.


ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని పాకిస్తాన్ భారత్ పైకి తీసుకువచ్చింది. మనం అమెరికానైనా ఎక్స్క్యూజ్ చేయలేదు కానీ పాకిస్తాన్ ఎక్స్క్యూజ్ చేసాము. అమెరికా తెలివితక్కువ తనాన్ని తిట్టాము. ఇప్పుడు అక్కడ అట్లానే ఉంటుంది. వాస్తవంగా అయితే కనుక ఉక్రెయిన్ ని తిట్టాలి. కానీ రష్యా అట్లా కాదు. టైం కోసం చూస్తుంది. ఇది జరిగిందంటే అమెరికానే మన మీదకి దాడికి వస్తుంది అని అంటుంది. ఇలా ఉంది అక్కడ.

మరింత సమాచారం తెలుసుకోండి: