గతంలో చంద్రబాబుపై ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినా విచారణ వరకు రావు అనే పరిస్థితి ఉండేది. అయితే అదే అదనుగా భావించిన  చంద్రబాబు , ఆయన శ్రేణులు  దమ్ముంటే మమ్మల్ని అరెస్టు చేయండి అన్నట్లుగా మాట్లాడేవారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసులు పైన కేసులు వేసి చంద్రబాబు నాయుడుని ఇరుకున పెడుతున్నట్టుగా తెలుస్తుంది.


ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలో చంద్రబాబు అరెస్ట్ జరిగింది.  ఇప్పుడు ఆయన జైల్లో ఉండగానే ఆయనపై మరో కేసు ఆరోపణ జరిగింది.  అదే రింగ్ రోడ్డు కు సంబంధించిన అలైన్మెంట్ లో మార్పుకు సంబంధించిన కేసు. అయితే రింగ్ రోడ్డే వెయ్యలేదు, మరి అలైన్మెంట్  మార్పు గురించి కేసు ఏమిటి అని అడిగిన నారాయణకు బెయిల్ అయితే వచ్చింది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ముందస్తు బెయిల్  కోసం దరఖాస్తు చేసుకున్నారట. అయితే అది ఇప్పుడు కోర్టులో ఉంది.


ఇది పక్కన పెడితే ఇది ఇంకా ముగియకుండానే మరో కేసు కూడా చంద్రబాబు నాయుడు పై ఆరోపణ జరుగుతుంది. అదే ఫైబర్ నెట్ స్కాం కి సంబంధించిన కేసు. దీనిపై విజయవాడ ఏసీబీ కోర్టులో పీటి వారెంట్ వేస్తే కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిలో ప్రధాన ముద్దాయిగా చంద్రబాబు నాయుడును ఆరోపిస్తున్నారు. దీనిలో టెరా సాఫ్ట్ అనే సంస్థకు అక్రమంగా టెండర్లు ఇచ్చారని సి ఐ డి  వాదిస్తుంది.


ఫైబర్ నెట్ అంటే గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 149 రూపాయలకే ఇంటర్నెట్ కం కేబుల్ ఆఫర్. అయితే దీనిని రాష్ట్ర ప్రభుత్వం సాధారణ జనాలకి 250రూపాయలకు ఇవ్వడం జరిగింది. దీనిలో 50రూపాయలు సరికొత్త సెట్ టాప్ బాక్స్ కోసమని, మరో 50రూపాయలు సర్వీస్ చార్జీల నిమిత్తమని వేయడం జరిగింది. కానీ ఈ కేసు నిలబడుతుంది అనే నమ్మకం లేదట.  ఎందుకంటే ఈ కేసులో చంద్రబాబు  పై ఆరోపణలు ఉన్నాయి. కానీ ఆయనే చేయించినట్లుగా ఆధారాలు లేవట.

మరింత సమాచారం తెలుసుకోండి: