
అయితే తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు జాతీయ అండ అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ లెవల్లో అయితేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, నితిన్ గడ్కారి లాంటి వాళ్లు చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో స్పందించారు. దీని వెనక కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణుల పాత్ర ఉందని అంటున్నారు. వాళ్ల వల్లే జాతీయస్థాయిలో ఉన్నటువంటి వీళ్ళు స్పందించారని అంటున్నారు.
వీళ్ళల్లో కూడా ఒక్క మమత బెనర్జీ స్పందన మాత్రమే స్వయంగా తెలిసినటువంటి విషయం. కానీ మిగిలిన వాళ్ళు స్పందించారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు చెప్తేనే తెలుస్తుంది. పార్టీలోని రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్ లాంటివాళ్ళు కేంద్రంలో తమకు పరిచయం ఉన్నవాళ్లతో కూడా ఇలా చెప్పిస్తున్నారని తెలుస్తుంది. అంతెందుకు నారా లోకేష్ ని గాని, భువనేశ్వరి దేవిని గాని, బ్రాహ్మణిని గాని డైరెక్ట్ గా వచ్చి పరామర్శించిన జాతీయస్థాయి నాయకులే లేరని అంటున్నారు.
ఆల్రెడీ నారా లోకేష్ ఢిల్లీలోనే ఉన్నారు. అలాంటప్పుడు అక్కడ కేంద్రానికి సంబంధించిన నాయకులు ఎవరైనా వచ్చి కనీసం నారా లోకేష్ ని అయినా పరామర్శించడం లేదు. ఐ ఎన్ డి ఐ ఏ కి సంబంధించిన సీతారాం ఏచూరి, రాజా ఇలాంటి వాళ్లు కూడా వచ్చి నారా లోకేష్ ని పరామర్శించడం జరగలేదు. తెలుగుదేశం గతంలో కేంద్రానికి సంబంధించిన అన్ని పార్టీల తోనూ ముందుకు వెళ్లడం, వదిలేయడం కూడా జరిగింది. అందుకే ఎవరూ మనస్ఫూర్తిగా ఈ అరెస్టుపై స్పందించడం లేదు.