
అంటే టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు ఇంటింటికీ గడప గడపకు వెళ్లి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం తన సభలు, సమావేశాలను పెట్టి ప్రజల్లోకి వెళ్లి జగన్ సర్కారు అవలంభిస్తున్నప్రజా వ్యతిరేక విధానాల గురించి ప్రజల్లోకి తీసుకెళుతున్న సమయంలో ఆయన అరెస్టయ్యారు. అయితే టీడీపీ నాయకులకు మాత్రం చంద్రబాబు ను ఎలాగైన అరెస్టు నుంచి బయటకు తీసుకురావాలనే ప్రయత్నంలోనే మునిగిపోయారు.
చంద్రబాబు అరెస్టు ను ఖండిస్తూ ఎక్కడికక్కడ టీడీపీ నాయకులు నిరసనలు, ధర్నాలు చేస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఇలాంటి సందర్భంలో పార్టీ రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలను మరిచిపోతున్నారు. కేవలం జగన్ బాబును అరెస్టు చేసి అన్యాయం చేశారని చెబుతూ అసలు లక్ష్యాన్ని మరిచిపోతున్నారు. అయితే చంద్రబాబు అనుకున్న లక్ష్యం గడప గడపకు టీడీపీ వెళ్లి ప్రజల్లో విశ్వాసం కల్పించాలి. అయితే రాబోయే ఎన్నికల్లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది.
అయితే చంద్రబాబు ఇప్పట్లో విడుదల కాకపోతే టీడీపీలో ఆత్మస్థైర్యం దెబ్బతింటుంది. కాబట్టి టీడీపీ నేతలు ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలను కలవడానికి వెళుతున్నారు. ఇలా చంద్రబాబు బెయిల్ కోసం తీవ్రమైన కృషి చేస్తున్నారు. కాబట్టి వైఎస్ జగన్ కొట్టిన దెబ్బ టీడీపీ నాయకులకు గట్టిగానే తగిలిందని అనుకోవచ్చు. మరి కొన్ని రోజులు పార్టీకి అస్తవ్యస్థ పరిస్థితి తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు.