తెలంగాణలో కాంగ్రెస్ అధికారం ఖాయమా.. ఎగ్జిట్ పోల్స్ నిజం అవుతాయా.. కర్ణాటక ఫలితాలు తెలంగాణాలో పునరావృతం అవుతాయా.. అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. మరికొద్దిగంటల్లో ఈ ఫలితాలు వచ్చేస్తాయి. అయితే బీఆర్ఎస్ లో మాత్రం ఇంకా ఆశలు వదులుకోలేదు. మరోవైపు బీజేపీ అంచనాలు పెరుగుతున్నాయి. మరో 24 గంటల్లో ఫలితాలు వెల్లడికానున్నాయి. ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన బీఆర్ఎస్ కు తెలంగాణ ప్రజలు గండికొట్టారనే ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.


అయితే బీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ అద్భుత మైండ్ గేమ్ ఆడిందనే చెప్పవచ్చు. బీఆర్ఎస్, బీజేపీ లోపాయికారు ఒప్పందం జరిగిందా. ఆ తరహా వార్తలు కానీ.. సూచనలు కానీ ఎక్కడా కనిపించలేదు. పైగా ఈటల రాజేందర్ గజ్వేల్ వెళ్లి సీఎం కేసీఆర్ పై పోటీకి నిలబెట్టారు. కామారెడ్డిలో కూడా కేసీఆర్ పై బలమైన అభ్యర్థినే ఆ పార్టీ నిలబెట్టింది. కవిత అరెస్టు అవుతుందని అందరూ భావించారు. బీజేపీ నాయకులు అయితే రేపో మాపో అనే విధంగా ప్రకటనలు ఇచ్చారు.


కానీ కవిత అరెస్టు కాకపోవడం బీజేపీ కి మైనస్ గా మారింది. ఈ ప్రభావం కారు పార్టీపై కూడా చూపింది. దీనినే సాకుగా చూపించి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేయడం మొదలు పెట్టింది. సోషల్ మీడియా, అనుకూల మీడియా ద్వారా బీఆర్ఎస్ బీజేపీ బీ టీం అనే ప్రచారం నిర్వహించి విజయవంతం అయ్యారు.


2018 ఎన్నికల సమయంలోనే కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ టీడీపీ కాంగ్రెస్ కలవడంతో ఆంధ్రా సెంటిమెంట్ ను రేకెత్తించి కేసీఆర్ వ్యతిరేకతను తప్పించుకోగలిగారు. కాకపోతే గులాబీ వ్యవహార శైలి నచ్చక ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ లను గెలిపించారు. ఆ తర్వాత జరగిని కొన్ని ఉప ఎన్నికల్లో సైతం బీఆర్ఎస్ ఓటమి పాలైంది. అయినా కేసీఆర్ నిరుద్యోగులను, కొన్ని వర్గాల ప్రజలను లైట్ తీసుకున్నారు. బీజేపీ ఎదుగుతున్న సమయంలో బండి సంజయ్ ని పదవి నుంచి తొలగించడం.. కవిత అరెస్టు ఆగిపోవడంతో ఆ పార్టీ నాయకులే బయటకు వచ్చి బీఆర్ఎస్ బీజేపీ ఒకటే నని ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ స్థానాన్ని కాంగ్రెస్ ఆక్రమించింది. ఇప్పుడు అధికారం చేపట్టబోతోందని పలు ఎగ్జిట్  పోల్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: