
కలుపుకుంట్ల కవిత.. బిఆర్ఎస్ అధినేత తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముద్దుల కుమార్తె మాత్రమే కాదు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో టిఆర్ఎస్ లో, ఇప్పుడు బిఆర్ఎస్ లో ఓ విడదీయలేని అనుబంధం ఏర్పరచుకున్న మహిళ. తెలంగాణ అంతటా తిరిగి ప్రత్యేక తెలంగాణ కోసం బతుకమ్మ పేర్చిన.. బతుకమ్మ ఆడినా.. ఉద్యమ కీలక నేతలలో ఒకరిగా ఉన్న కవిత అనంతరం జాగృతికి శ్రీకారం చుట్టి శ్రేణులను మరియు ముఖ్యంగా మహిళలను కూడా తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం చేశారు. ఇప్పుడు పార్టీతో ఆమెకు పేగు బంధం తెగిపోయింది. పుట్టి పెరిగిన పార్టీ ఆమెను బయటకు పంపేసింది. కన్నతండ్రి కెసిఆర్ సాక్షాత్తు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మరి ఇప్పుడు కవిత భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది కూడా తెలంగాణ రాజకీయ వర్గాలలో ఆసక్తిగా మారింది.
టీబీఆర్ఎస్ లేదా తెలంగాణ రాజ్యసమితి పేరుతో ఆమె కొత్త పార్టీ ఏర్పాటుకు అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అయితే అంతకంటే ముందు ఆమె పార్టీ సభ్యత్వం తో పాటు తనకు పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకటి రెండు రోజులలో ఆమె భవిష్యత్తు కార్యచరణ వెల్లడించనున్నారు. కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం చాలా దుర్మార్గమని తెలంగాణ జాగృతి శ్రేణులు మండిపడుతున్నాయి. అయితే బిఆర్ఎస్ మాత్రం కవిత పార్టీలో ఉంటే ఎంత.. పోతే ఎంత అని.. ఎవరో కవిత భుజం మీద తుపాకీ పెట్టి కాల్పిస్తున్నారు అని కౌంటర్ ఇస్తున్నారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ మహిళా శ్రేణులతో కవితపై విమర్శలు చేయుచున్నారు.
ఇక తన కుమార్తెను పార్టీ నుంచి బయటకు పంపే వేళ కవిత ఎందుకు ఎలా చేసింది ఆమెకు తాను ఏం తక్కువ చేశాను ? నిజామాబాద్ ఎంపీగా గెలిపించాను.. ఎంపీగా ఓడిపోతే తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చాను.. మద్యం కేసులో అరెస్టు అయితే ఎంతో ఖర్చు పెట్టి లాయర్లను పెట్టాను అని బిఆర్ఎస్ నేతలతో కాస్త ఆవేదనతో అన్నట్టు సమాచారం. అయితే కొందరు నేతలు మాత్రం కవితను పార్టీ నుంచి బహిష్కరిస్తేనే మంచిదని తమ అభిప్రాయాలు వ్యక్తం చేసినట్టు తెలిసింది.