
సీనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు కనీస వేతనం 42 వేలు ఉండగా, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు సంబంధించి న వారికి వేతనం 47 వేలు చెల్లిస్తున్నారు. నోటిఫికేషన్ ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఇందులో 16 జూనియర్ రీసెర్చ్ ఫెలో, ఒక పోస్టు ప్రాజెక్టు సీనియర్ అసోసియేట్, మరో రెండు ఖాళీలు రీసెర్చ్ అసోసియేట్ విభాగంలో ఉన్నాయి. మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో ఎంటెక్ చేసిన వారి కోసం రెండు జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి.కెమికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం మూడు జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు..
విద్యా అర్హతలు..
ఎయిరోస్పేస్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం జేఆర్ఎఫ్ విభాగంలో రెండు ఖాళీలు ఉన్నాయి.డిజైన్, థర్మల్, స్ట్రక్చరల్, మెకానికల్ ఇంజనీరింగ్ లో బీటెక్, ఎంటెక్ చేసిన వారి కోసం ఒక జేఆర్ఎఫ్ ఖాళీ ఉంది.ఫిజిక్స్ లో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం ఒక ఖాళీ, కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ చేసిన వారి కోసం 4 జేఆర్ఎఫ్ ఖాళీలు ఉన్నాయి. బీటెక్ , ఎంటెక్ చేసిన వారికి జేఆర్ఎఫ్ లో ఒక ఖాళీ ఉంది. ఇకపోతే పీహెచ్డి చేసిన వారికి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు విఎస్ఎస్సి వెబ్ సైట్ లో చూసి ఏప్రిల్ 9 లోగా అప్లై చేసుకోవచ్చు..