మానసిక ఒత్తిడి, ఆందోళన, అసూయ, అందరికన్న తక్కువ అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరిగే పిల్లలు, ఉన్నత విద్యను అభ్యసించే వారికి, ఉద్యోగస్తులు, గృహిణులు, ఇలా అందరినీ వేధించే సమస్యలు వాటని అధికమించి విజయవంతమైన జీవితాన్ని పొందాలంటే పోషకాహారం ఉపయోగపడుతుంది. ప్రతిరోజూ సమతుల ఆహారాన్ని తీసుకోవడం వల్ల చిరాకుల నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ఉదాసీన వైఖరితో రోజంతా స్తబ్దుతంగా వుండేవారు పప్పులు, ధాన్యాలు, గింజలు, చేపలు, మాంసం, కోడిగుడ్లు, పాలు పాలపధార్థాలు, తాజాకూరగాయలు, పండ్లు తినాలి, వీటిలో సమృద్దిగా వుండే విటమిన్ ఎ, విటమిన్ సి, బీటా కరోటిన్, విటమిన్ ఇ, సెలీనయమ్, జింక్, కాపర్, మాంగనీస్లు ఒత్తిడిని అధికమించే పోషకాలను శరీరానికి అందిస్తాయి. ఉడకబెట్టిన పప్పులు, వైట్ రైస్, బీన్స్, గింజలు, చేపలు, పాలు, కోడిగుడ్లు, తాజా కూరలు, పండ్లు తినడం వల్ల ఆందోళన తగ్గి నిదానంగా ఆలోచించే శక్తి పెరుగుతుంది. వీటిలో వుండే ద్రవపదార్థాలు బి కాంప్లెక్స్, రిబిప్లోవిన్, వైసిన్, పిరిడాక్సిన్ మొదలైనవి మెదడును, నరాల పనితనాన్ని మెరుగుపరుస్తాయి. మెదడుకు రక్తప్రసరణ శక్తి పెరుగుతుంది. బి. విటమిన్ వల్ల మెదడు శక్తి పెరిగి ఆలోచన, ఊహాశక్తి చదువాలనే ఆసక్తి పెరుగుతుంది. యుక్త వయసులోకి ప్రవేశించేవారిలో సరైన మెంటల్ బాలెన్స్ వుండదు ఒకవిధమైన చిరాకు, ఆందోళనతో బాధపడుతారు. అలాంటి వారు పాలు, పెరుగు, వెన్న, చీజ్ మొదలైన పాలతో తయారయ్యే పధార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. డ్రైఫ్రూట్స్, అందులోనూ అంజూర పళ్ళు తింటే ఆలోచన విధానం సక్రమంగా వుండి సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆకుకూరలు, పుదీనా, సీఫుడ్స్, అరటిపళ్ళులో వుండే మాంగనీసు స్తబ్ధతను తొలగించి ఉత్సాహంగా వుండటానికి ఉపయోగపడతాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: