సాధారణంగా ఏం తిన్నా వికారంగా అనిపించడం, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక పోవడం, అప్పుడప్పుడు కడుపులో నొప్పి రావడం, అసౌకర్యంగా అనిపించడం వంటి లక్షణాలు ఇన్ఫెక్షన్ల ను గా గుర్తించవచ్చు.. నిజానికి మనం తీసుకునే ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థలో తలెత్తే ఇలాంటి సమస్యలను మనం చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటాం.. అంతేకాకుండా తగ్గిపోతుందిలే అన్న నిర్లక్ష్యం కూడా మనలో ఉంటుంది.. కానీ ఇలాంటి లక్షణాలను పొట్ట చుట్టూ ఇన్ఫెక్షన్లు లేదా ఫ్లూ అంటున్నారు నిపుణులు.. ఇలా జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతినడం వల్ల, దీని ప్రభావం ఇతర అవయవాల పనితీరు పై కూడా పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే మనం తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే, ఈ సమస్యను దూరం చేసుకోవచ్చని కూడా వారు చెబుతున్నారు..


కడుపులో ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు లేదా రాకముందు ఏ పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


పొట్ట లో ఇన్ఫెక్షన్ కారణంగా అయ్యే వాంతులు, విరోచనాలు వల్ల శరీరం ఎక్కువ మొత్తంలో నీటిని కోల్పోతుంది. తర్వాత శరీరం డీహైడ్రేషన్ బారినపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి.. కాబట్టి మన శరీరంలో నీటిశాతాన్ని పెంచుకోవడానికి నీళ్లు, ఎలక్ట్రోలైట్ వాటర్, కొబ్బరి నీళ్లు, అల్లం తో తయారు చేసిన టీ, తాజా పండ్లు వంటివి తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గడంతో పాటు శరీరానికి శక్తి కూడా లభిస్తుంది..


ఇక కడుపులో వికారంగా అనిపించినప్పుడు కోడిగుడ్లను స్నాక్స్ గా తీసుకుంటే, చక్కటి ఫలితం ఉంటుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ బి, సెలీనియం రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడంలో సహకరిస్తాయి. తద్వారా ఎలాంటి సమస్యనైనా దూరం చేసుకోవచ్చు..
ఇక మనలో చాలా మంది తేలికగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలను మాత్రమే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు.. ప్రతి ఒక్కరూ ఇదే చేయాలి కూడా.. అయితే మరీ ముఖ్యంగా ఈ క్రమంలోనే పెసరపప్పు, బియ్యంతో చేసుకునే కిచిడీ తీసుకోవడం వల్ల శరీరానికి ప్రోటీన్లు అందుతాయి..


అంతే కాకుండా అరటి పండ్లు, అన్నం, ఆపిల్ సాస్, టోస్ట్ వంటివి తీసుకోవాల్సి ఉంటుంది. వీటిలో అధిక మొత్తంలో ఉండే కార్బోహైడ్రేట్లు శరీరానికి కావలసిన శక్తిని అందించడంతోపాటు వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా శరీరానికి అందుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: