తులసి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల జలుబు , దగ్గు మాత్రమే కాదు జీర్ణ సంబంధిత సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇకపోతే ప్రతిరోజు తులసి నీటిని ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ప్రతిరోజు తులసి ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్స్ తొలిగిపోతాయి.  దీనితోపాటు శరీర ఉష్ణోగ్రతను కూడా అదుపులో ఉంచుతుంది.  ముఖ్యంగా ఈ ఆకులను తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు.. శరీరంలో కొలెస్ట్రాల్ కూడా పెరగదు వర్షాకాలంలో పసుపు , తులసి కషాయాలు మీకు రోగనిరోధక శక్తిని పెంచి జలుబు , గొంతు సమస్యలను కూడా అధిగమించడానికి సహాయపడతాయి.  ప్రతిరోజు ఖాళీ కడుపుతో తులసినీలు తీసుకోవడం వల్ల అధిక  బరువు ,  కడుపునొప్పి వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చు.. కడుపులో ఆమ్లత్వం గనుక ఉంటే ప్రతిరోజు మూడు తులసి ఆకులను నమిలి మింగాలి అలాగే కొబ్బరి నీళ్లు నిమ్మరసం తులసి ఆకులు కలిపి తాగినా సరే కడుపునొప్పి నుండి ఉపశమనం పొందుతారు.

తులసితో టీ లేదా కషాయం చేసుకుని తాగడం వల్ల జీర్ణ సంబంధి సమస్యలు పోయి కాలానుగుణంగా వచ్చే ఇన్ఫెక్షన్లు కూడా దూరం అవుతాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసి నీరు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు దీని కారణంగా శరీరంలోని విష పదార్థాలు బయటకు పోయి రోగనిరోధక శక్తి పెరిగి చక్కర స్థాయి కూడా నియంత్రణలో ఉంటుంది.

అలాగే తులసి మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది..  క్రమం తప్పకుండా తులసి ఆకులతో చేసే టీని తీసుకోవడం వలన ఇది చర్మపు కణాలు రిపేరు చేసి, చర్మపు సమస్యలను తగ్గిస్తుంది. చర్మంపై ఏర్పడే మచ్చలు,ముడతలు వంటి సమస్యలను తగ్గిస్తుంది.తులసి నీటి సేవనం వలన కఫం తగ్గుముఖం పడుతుంది. కాళ్ల పగుళ్లు మరియు పాదాల సమస్యలతో బాధపడేవారు ఒక తొట్టనీటిలో కొన్ని తులసి ఆకులను వేసి అందులో పాదాలను ఉంచుకోవడం ద్వారా పాదాల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: