వేసవి కాలంలో ఎక్కువగా అమ్ముడుపోయే మద్యం ఏదైనా ఉంది అంటే అది బీర్ మాత్రమే. బ్రాండ్ ఏదైనా సరే ఎర్రటి ఎండలో బీర్ తాగడం కొందరికి మంచి మజా అందిస్తుంది. అయితే వేసవికాలం సాయంత్రం సమయాల్లో కూడా బీర్ తో సేదతీరే వారు ఉంటారు. ఇక వీకెండ్ పార్టీస్ లో కేవలం బీర్ తీసుకునే వారు ఉంటారు. అయితే బీర్ తాగడం వల్ల అనారోగ్యం కలుగుతుందని డాక్టర్లు చెబుతుంటారు. కానీ ఏదైనా అమితంగా తీసుకుంటే తప్ప మితంగా ఉంటే బీర్ కూడా మంచిదే అంటున్నారు కొందరు వైద్య నిపుణులు.

బీర్ ని మితంగా తీసుకోవడం వల్ల చాలా రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. వాటిలో మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో బీర్ దోహదపడుతుందని అంటున్నారు. ఇక ఎముకల ఆరోగ్యానికి కూడా బీర్ మంచిదని చెబుతున్నారు. డయాబెటిస్ ను కంట్రోల్ చేయడంలో కూడా బీర్ మంచి ప్రయోజనకరమని అంటున్నారు. జీర్ణక్రియ మెరుగు పరచుకోవడంలో బీర్ సహకరిస్తుందట. గుండెజబ్బులకు కూడా బీర్ తాగడం వల్ల కొంత కంట్రోల్ అవుతుందని చెబుతున్నారు.

డాక్టర్లు తాగమన్నారు కదా అని బాటిల్స్ బాటిల్స్ లేపకుండా కేవలం మితంగా వారు చెప్పినంత మాత్రమే బీర్ తీసుకుంటే దాని వల్ల ఎలాంటి అనారోగ్యం కలగదు సరికదా బీర్ తాగడం వల్ల కొన్ని మంచి ప్రయోజనాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. బీర్ తాగడం వల్ల మంచి అని అదే పనిగా తాగినా సరే అది కూడా అనారోగ్యానికి గురయ్యేలా చేస్తుంది. వేసవిలో బీర్ తాగే వారి శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తగిన మోతాదులో మాత్రమే బీర్ తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. ఫారిన్ కంట్రీస్ లో బీర్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. మన ఇండియా లో కూడా బీర్ ప్రియులు ఎక్కువే కానీ ఒకటితో మొదలై ఎక్కడిదాకా వెళ్తుందో ఎవరికీ తెలియదు కానీ బీర్ ని కూడా కంట్రోల్ గా తీసుకుంటేనే మంచిది లేకపోతే రివర్స్ లో హెల్త్ ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు వైద్య నిపుణులు.




మరింత సమాచారం తెలుసుకోండి: