చాలా మంది ఆర్థరైటిస్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. జాయింట్ల నొప్పితో బాధ పడుతూ సతమతమవుతూవుంటారు. ఇంకో విషయం ఏమిటంటే ఒక కుటుంబంలో ఏ వ్యక్తికైనా ఈ సమస్య ఉంటే కుటుంబసభ్యులకు కూడా ఈ రిస్క్ ఉంటుంది. అంటే, ఫ్యామిలీ హిస్టరీ కూడా ఈ సమస్యకు గురిచేసే రిస్క్ ఫ్యాక్టర్ అని గమనించాలి. ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజ్. దీని వల్ల జాయింట్ పెయిన్ వస్తుంది. అలాగే శరీరం మొత్తం డేమేజ్ అవుతుంది. ఈ రకమైన ఆర్థరైటిస్ వల్ల వచ్చే జాయింట్ డేమేజ్ శరీరానికి ఇరువైపులా జరుగుతుంది. కాబట్టి, ఒకవేళ ఒక కాలు లేదా ఒక చేతిలో జాయింట్ అనేది ఎఫెక్ట్ ఐతే, ఇంకొక కాలు అలాగే చేతిపై కూడా ప్రభావం పడుతుంది. ఈ విధంగా మిగతా ర్యుమటాయిడ్ ఆర్థరైటిస్ కు అలాగే ఓస్టియో ఆర్థరైటిస్ వంటి ఇతర ఆర్థరైటిస్ రకాలకు మధ్యలో ఉన్న తేడాను వైద్యులు గుర్తించగలరు.ఇక ఈ పద్ధతులు పాటిస్తే ఆర్థరైటిస్ బారిన పడే అవకాశం ఉండదు.

జాయింట్స్ లో మోషన్ ఇంప్రూవ్ అవ్వాలంటే తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామాలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీని వల్ల మొబిలిటీ పెరుగుతుంది. వ్యాయామం వల్ల కండరాలు బలపడతాయి. దాంతో, జాయింట్స్ పై ప్రెజర్ తగ్గుతుంది.యోగా వంటివి ప్రాక్టీస్ చెయాయడం వాళ్ళ కూడా స్ట్రెంత్ తో పాటు ఫ్లెక్సిబిలిటీను తిరిగి పొందగలుగుతారు.తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో తగినంత విశ్రాంతి అవసరం. సరైన నిద్ర వల్ల ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. నొప్పితో పాటు అలసట కూడా తగ్గుతుంది.

ఇటువంటి డైట్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాటీ ఫిష్, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా లభిస్తాయి.ఆక్సిడెంట్స్ కూడా ఇన్ఫ్లమేషన్ రిస్క్ ను తగ్గిస్తాయి. బెర్రీస్, డార్క్ చాకొలేట్, స్పినాచ్, కిడ్నీ బీన్స్, పెకాన్స్ మరియు ఆర్టిచోక్స్ వంటి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా లభిస్తాయి.

ఇక ఈ పద్ధతులు, ఆహార అలవాట్లను పాటిస్తే కచ్చితంగా ఆరోగ్యకరంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: