సాధారణంగా మసాలా లో ఎక్కువ తింటే గుండెకు హానికరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కానీ అందులో కొన్ని మసాలా దినుసులు ఆరోగ్యానికి మంచిదని ఒక సర్వేలో వెల్లడైంది. తాతల కాలంలో గుండెజబ్బులు అంటే దాదాపుగా 60 సంవత్సరాలు దాటిన వారికి వస్తాయి. కానీ ప్రస్తుతం 20 నుండి 25 సంవత్సరాల వారికి రావడం బాధాకరమైన విషయం.
 ప్రస్తుత కాలం ఉన్న టెన్షన్స్ వల్ల, సమయానికి సరైన తిండి తినకపోవడం వల్ల, శరీరానికి కావాల్సిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కూడా గుండె జబ్బులు ఎదురవుతుంటాయి.
 ఇలాంటి వాటి కోసమే కొన్ని చిట్కాలు పాటిస్తే గుండె జబ్బులు రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అవి ఏంటో ఆ మసాలా దినుసులు గురించి ఇప్పుడు మనం చదివి తెలుసుకుందాం.
వాము లో పొటాషియం, క్యాల్షియంలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె సమస్యలు రాకుండా ఆపుతాయి.అంతేకాకుండావామును రోజు తినడం వల్ల అధిక రక్తపోటు తగ్గి, గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.
దాల్చిన చెక్కలో అధికంగా యాంటీఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలుకలిగి ఉన్నాయి. దాల్చిన చెక్క ఆహారపదార్థాలకు మంచి రుచి,వాసన ఇవ్వడమే కాకుండారక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. అంతే కాకుండా గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.
లవంగాలు తినడానికి ఘాటుగా ఉంటాయి. లవంగాలు రక్తాన్ని శుద్ధి చేసి రక్తసరఫరా జరిగేలా చేస్తాయి.లవంగాలు పంటి నొప్పిని సైతం నశింపజేస్తాయి.లవంగాలను రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
మిరియాలు కూడా గుండె ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో సహాయపడుతుంది. మిరియాలు తినడం వల్ల గుండె చుట్టూ ఉన్న కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. ఇంత మంచి ఔషధ గుణాలు కలిగిన ఈ మసాలా దినుసులను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోని,మన గుండెను సంరక్షించుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి: