ప్రకృతి నుంచి లభించే వాటిలో కరక్కాయ ఒకటి.ఇది పూర్వ కాలం నుంచి ఆయుర్వేదంలో కీలక పాత్ర పోషిస్తుంది. చూడడానికి ఎంతో చిన్నవిగా కనిపించే ఈ కరక్కాయలలో ఔషధగుణాలు పుష్కలంగా లభిస్తాయి.ఈ కరక్కాయలను ఉపయోగించి ఎన్నో రకాల వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వగరు, తీపి, పులుపు, చేదు వంటి రుచిని కలిగినటువంటి కరక్కాయ వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...                              

శరీర బరువును అధికంగా పెరిగే వారు ప్రతి రోజు ఈ కరక్కాయను తీసుకోవడం వల్ల శరీర బరువు తగ్గుతారు.
ఎక్కువ దగ్గు సమస్యతో బాధపడేవారు కరక్కాయ పైభాగం కొద్దిగా నోటిలో పెట్టుకుని చప్పరిస్తూ దాని ద్వారా వచ్చే రసాన్ని మింగటం ద్వారా దగ్గు నుంచి ఉపశమనం పొందవచ్చు. తలనొప్పితో బాధపడేవారు కరక్కాయ గింజల పట్టా వేసుకోవడం ద్వారా తలనొప్పి తగ్గుతుంది. ఎక్కిలతో సమస్యతో బాధపడేవారు ఈ కరక్కాయ చూర్ణం కొద్దిగా గోరువెచ్చని నీటిలో కలుపుకుని తాగడం ద్వారా ఎక్కిల నుంచి ఉపశమనం పొందవచ్చు. కరక్కాయ, తేనె, బెల్లం కలిపి తీసుకోవడం ద్వారా క్యాన్సర్ నివారించవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు,చర్మ సమస్యలతో బాధపడేవారు కరక్కాయలను వాడటం ద్వారా పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.                                      

కరక్కాయలను ఎవరు వాడకూడదు:

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ కరక్కాయలను శరీరం బలహీనంగా ఉన్నవారు, ఉపవాసాల వల్ల బలహీనంగా ఉన్నవారు, శరీర వేడి ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, అధిక రక్తస్రావం అయ్యేవారు,ఎటువంటి పరిస్థితులలో కూడా ఈ కరక్కాయలను ఉపయోగించకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: