నిజానికి ఇంజ‌క్ష‌న్ వేయించుకోవ‌డం చాలామందికి విప‌రీత‌మైన భ‌యం ఉంటుంది. కానీ, క‌రోనా వైర‌స్‌ను అరిక‌ట్టడానికి అంద‌రూ త‌ప్ప‌నిస‌రిగా క‌రోనా టీకా తీసుకోవాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ, సూది మందు అంటే భ‌యం ఉన్న వాళ్ల‌కు ఇంజ‌క్ష‌న్ లేకుండానే క‌రోనా మందు ఇవ్వ‌బోతున్నారు. వైద్య శాస్త్రంలో రోజు రోజు కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతుంటాయి. అందులో భాగంగానే సూది లేకుండా టీకాను అలాగే క‌నిపెట్టారు. త్రిడి ప‌రిజ్ఞానంతో అమెరికా శాస్త్ర వేత్త‌లు అద్భుతం చేశారు. టీకా లేకుండానే వ్యాక్సిన్ వేసే ప్ర‌క్రియ‌ను క‌నిపెట్టారు.


    ఓ చిన్న‌పాటి ప‌ట్టి ని అభివృద్ది చేసి దాని ద్వారా క‌రోనా వ్యాక్సిన్ ను శ‌రీరంలోకి పంపే విధానాన్ని ఆవిష్క‌రించారు అమెరికా శాస్త్ర వేత్త‌లు. త్రిడి విధానంలో క‌నిపెట్టిన ఈ ప‌ట్టి ఇంజ‌క్ష‌న్ కంటే ఎక్కువ ప్ర‌భావంగా ప‌ని చేస్తుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు వెల్ల‌డించారు. నిజానికి టీకా ఏదైనా రోగ నిరోధ‌క శ‌క్తి ని పెంచే క‌ణాల‌పైన ప‌నిచేస్తుంది. తాజాగా క‌నిపెట్టిన టీకా ప‌ట్టిని చెతికి అంటించ‌డం ద్వారా క‌ణాల‌నే ల‌క్ష్యంగా చేసుకుని శ‌రీరంలోకి వెళ్తుంద‌ని, ఫలితంగా అత్యుత్తమ ఫ‌లితాల వ‌స్తాయ‌ని పేర్కొన్నారు వైద్యులు.


 ఇంజెక్ష‌న్ ద్వారా ఇచ్చే టీకా కంటే ఇది ప‌ది రేట్లు స‌మ‌ర్థ‌వంతంగా పని చేస్తుంద‌ని వివ‌రించారు. అలాగే రోగ‌నిరోధ‌క శ‌క్తికి సంబంధించిన టీకా స్పంద‌న‌ను 50 రేట్లు ఎక్కువ‌గా క‌లిగిస్తుంద‌ని కూడా తెలిపారు. పాలిమ‌ర్ ప‌ట్టిపై త్రీడి ముద్ర‌ణతో సూదులు అమ‌ర్చ‌డం ద్వారా ఈ ప‌ట్టిని రూపొందించారు శాస్త్ర వేత్త‌లు. హెప‌టైటీస్‌, కరోనా టీకాల‌ను వేసేందుకు ఈ సూక్ష్మ సూదుల్లో మార్పులు చేసుకోవ‌చ్చ‌ని ప‌రిశోధ‌న బృందానికి నేతృత్వం వ‌హించిన జోస‌ఫ్ డీ సైమ‌న్ తెలిపారు. ఈ ప‌ట్టి అంటించిన త‌రువాత ఈ సూక్ష్మ సూదులు శ‌రీరంలో క‌లిసిపోతాయ‌ని వెల్లడించారు. దీంతో ఎవ‌రికి వారే దీని ద్వారా టీకాలు వేయించుకోవ‌చ్చ‌ని వివ‌రించారు. ఈ కొత్త విధానంతో వ్యాక్సిన్ వేయించుకోవాలంటే భ‌య‌పడే వారు భ‌యాన్ని వీడి టీకా తీస‌కుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: