
ముఖ్యంగా చింతపండులో విటమిన్ సి తోపాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే శరీరంలో అనేక సమస్యలను దూరం చేయడానికి చింతపండు సహాయ పడుతుంది. ఇక చింతపండు గింజల్లో ఫైటో న్యూట్రియన్స్ ఉండడం వల్ల శరీరంలోకి ఎటువంటి వైరస్లు ప్రవేశించలేవు. అలాగే టార్టారిక్ యాసిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్ కూడా చింతపండులో లభిస్తుంది ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ తో పోరాడి జబ్బుల బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఇక శరీరంలోని అధిక కొలెస్ట్రాలను దూరం చేయడంలో చింతపండు చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా రక్తంలో షుగర్ లెవెల్స్ ను అదుపులో ఉంచుతుంది.
అధిక రక్తపోటుతో పాటు కొన్నిరకాల అల్సర్లు అలాగే కీళ్ల నొప్పులు, బొబ్బలు, బేణుకులు కూడా తగ్గి పోతాయి. అయితే ఇలాంటి చర్మ సమస్యలు వచ్చినప్పుడు చింత చెట్టు యొక్క పువ్వులను, ఆకులను ఎండబెట్టి.. ఉడకబెట్టి ఆ తర్వాత ఆ నీటిని చర్మానికి రాసుకుంటే ఇలాంటి సమస్యలు తగ్గిపోతాయి. ముఖ్యంగా చింత పండు గింజల వల్ల మలబద్ధకం, జీర్ణ సమస్యలు కూడా దూరం చేసుకోవచ్చు. మంచి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండే చింతపండు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.